SSC CGL Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో 20,000 సీజీఎల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తివివరాలివే..

భారత ప్రభుత్వ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (Staff Selection Commission) వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న.. 20,000 పోస్టులను (Combined Graduate Level jobs) కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2022 ద్వారా భర్తీకి..

SSC CGL Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో 20,000 సీజీఎల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తివివరాలివే..
Staff Selection Commission Tv9 Telugu
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 02, 2022 | 7:43 AM

SSC Combined Graduate Level Examination 2022: భారత ప్రభుత్వ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (Staff Selection Commission) వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న.. 20,000 పోస్టులను (Combined Graduate Level jobs) కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2022 ద్వారా భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్, అసిస్టెంట్, SI, టాక్స్ అసిస్టెంట్ C, UDC, అసిస్టెంట్, అకౌంటెంట్, ఆడిటర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (JSO), ఇన్‌స్పెక్టర్, డివిజనల్ అకౌంటెంట్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/అప్పర్ డివిజన్ క్లర్క్‌, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్‌ స్టూడెంట్స్‌ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల వయసు గ్రూప్ సీ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు, గ్రూప్‌ బీ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 8, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ సారి కేవలం టైర్‌-I, టైర్‌-II ద్వారా మాత్రమే అభ్యర్ధులను ఎంపిక చేయనున్నారు. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.29,200ల నుంచి రూ.1,12,400ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

రాత పరీక్ష విధానం: టైర్‌ -1 పరీక్ష 200 మార్కులకు గానూ 100 మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నలుంటాయి. గంటలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

  • జనరల్‌ ఇంటెలిజన్స్‌ అండ్‌ రీజనీంగ్‌లో 25 ప్రశ్నలకు 50 మార్కులు
  • జనరల్‌ అవేర్‌నెస్‌లో 25 ప్రశ్నలకు 50 మార్కులు
  • క్వాంటిటేవిట్‌ ఆప్టిట్యూడ్‌లో 25 ప్రశ్నలకు 50 మార్కులు
  • ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, కాంప్రహెన్షన్‌లో 25 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు..

ఇవి కూడా చదవండి
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: సెప్టెంబర్‌ 17, 2022.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్‌ 8, 2022.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: అక్టోబర్‌ 9, 2022.
  • ఆఫ్‌లైన్‌ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: అక్టోబర్‌ 10, 2022.
  • టైర్‌ -I పరీక్ష తేదీ: డిసెంబర్‌ 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.