AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB Exam Day Guidelines 2025: ఆర్‌ఆర్‌బీ రైల్వే పరీక్షలు రాసే అభ్యర్థులకు అలర్ట్‌.. ఈ తప్పులు చేశారో పరీక్ష కేంద్రంలోకి నో ఎంట్రీ!

రైల్వేశాఖ ఆధ్వర్యంలో నియామకాల కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ).. వివిధ పోస్టుల నియామాకాలను వరుస పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తదనుగుణంగా ఆర్‌ఆర్‌బీ పరీక్షలను ఇబ్బంది లేకుండా, సజావుగా నిర్వహించడానికి అభ్యర్ధులకు కొన్ని ముఖ్య సూచనలు జారీ చేసింది. అవేంటంటే..

RRB Exam Day Guidelines 2025: ఆర్‌ఆర్‌బీ రైల్వే పరీక్షలు రాసే అభ్యర్థులకు అలర్ట్‌.. ఈ తప్పులు చేశారో పరీక్ష కేంద్రంలోకి నో ఎంట్రీ!
ఫేజ్ 3లో జూన్ 13 నుంచి జూన్ 19 వరకు దరఖాస్తుల స్వీకరణ, జూన్ 13 నుంచి జూన్ 19 వరకు వెబ్ ఆప్షన్, జూన్ 23 న సీట్ల కేటాయింపుతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది.
Srilakshmi C
|

Updated on: Apr 29, 2025 | 5:13 PM

Share

హైదరాబాద్‌, ఏప్రిల్ 29: భారతీయ రైల్వేశాఖ ఆధ్వర్యంలో నియామకాల కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ).. వివిధ పోస్టుల నియామాకాలను వరుస పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తదనుగుణంగా ఆర్‌ఆర్‌బీ పరీక్షలను ఇబ్బంది లేకుండా, సజావుగా నిర్వహించడానికి అభ్యర్ధులకు కొన్ని ముఖ్య సూచనలను జారీ చేసింది. ఈ సూచనలను పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా పాటించాలని తెలుపుతూ ప్రకటన జారీ చేసింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు నిషేధిత వస్తువులతో పరీక్ష కేంద్రంలోకి అనుమతించరాదని సూచించింది.

అంటే ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, మొబైల్ ఫోన్లు, పేజర్, గడియారాలు, ఇయర్‌ఫోన్, బ్లూటూత్ ఆధారిత పరికరాలతోపాటు మైక్రోఫోన్, హెల్త్ బ్యాండ్‌లు, కాలిక్యులేటర్లు, పుస్తకం, పెన్, పేపర్, పెన్సిల్, ఎరేజర్, పౌచ్, స్కేల్, రైటింగ్-ప్యాడ్, బెల్టులు, హ్యాండ్‌బ్యాగ్, క్యాప్, పర్స్ కెమెరా, వాటర్ బాటిల్, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు వంటివి పరీక్షా కేంద్రంలోకి తీసుకురావద్దని, వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని తన ప్రకటనలో పేర్కొంది.

పరీక్షా కేంద్రం లోపలికి వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న ఈ-కాల్ లెటర్ మాత్రమే అనుమతిస్తామని, పరీక్షా కేంద్రం లోపలికి అభ్యర్థులు ఎటువంటి పెన్ను, పెన్సిల్ వంటివి తీసుకెళ్లకూడదని ఆర్‌ఆర్‌బీ స్పష్టం చేసింది. పరీక్ష సమయంలో అభ్యర్థులకు సిబ్బంది పెన్నులు అందిస్తారని తెలిపింది. బయోమెట్రిక్స్ నమోదుకు ఆటంకం కలుగకుండా అభ్యర్థులు తమ చేతులు, కాళ్లపై గోరింటాకు లేదా హెన్నా పెట్టుకోవద్దని సూచించింది. తనిఖీ సమయంలో మంగళసూత్రంతో సహా అభ్యర్థులు లోహపు దుస్తులు, మతపరమైన చిహ్నాలు, గాజులు, ఆభరణాలు, బ్రాస్‌లెట్‌లను ధరించి ఉన్నట్లు గుర్తిస్తే.. వారి కాల్ లెటర్‌లో ఆ వస్తువులకు సంబందించి తగిన ఆమోదం ఉంటేనే పరీక్షా హాలులోకి అనుమతి ఉంటుంది. లేనిపక్షంలో అట్టి వస్తువులు కలిగి ఉన్నవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.