REC Recruitment: బీటెక్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..
బీటెక్/ఎంటెక్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం సొంతం చేసుకునే అవకాశం. రూరల్ ఎలక్ట్రిఫికేషణ్ కార్పొరేషన్ లిమిటెడ్ (REC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇందులో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు...
బీటెక్/ఎంటెక్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం సొంతం చేసుకునే అవకాశం. రూరల్ ఎలక్ట్రిఫికేషణ్ కార్పొరేషన్ లిమిటెడ్ (REC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇందులో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 62 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో జనరల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ ఆఫీసర్, ఆఫీసర్ వంటి పోస్టులు ఉన్నాయి.
* ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, హ్యూమన్ రిసోర్స్, ఐటీ, కార్పొరేట్ కమ్యునికేషన్, కంపెనీ సెక్రటేరియట్, రాజ్‌భాష విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్/ బీఈ/ బీటెక్/ సీఏ/ ఎంబీఏ/ ఎంసీఏ/ ఎంసీఎస్/ ఎంటెక్/ ఎంఎస్సీ పూర్తి చేసి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 33 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని, అప్లికేషన్ ఫామ్‌ను ఆఫ్‌లైన్ విదానంలో పంపించాలి.
* దరఖాస్తులను ఆర్‌ఈసీ వరల్డ్ హెడ్ క్వార్టర్స్, 1-4 సెక్టర్ 29, ఐఎఫ్‌ఎప్‌సీఓ చౌక్ మెట్రో స్టేషన్ దగ్గర, గుర్గామ్, హర్యానా, 122001 అడ్రస్‌కు పంపించాలి.
* అభ్యర్థులను ఇంటర్వ్యూలో చూపిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 27-10-2022ని చివరి తేదీగా నిర్ణయించారు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులను 03-11-2022 తేదీలోపు పంపించాలి.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..