ITBP Recruitment: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 80 వేలకుపైగా జీతం..
ITBP Recruitment: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ITBp) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్-సి విభాగంలో హెడ్ కానిస్టేబుల్ (ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సెలర్) ఖాళీలను భర్తీ చేయనున్నారు. పురుషులు, మహిళలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు...
ITBP Recruitment: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ITBp) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్-సి విభాగంలో హెడ్ కానిస్టేబుల్ (ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సెలర్) ఖాళీలను భర్తీ చేయనున్నారు. పురుషులు, మహిళలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 23 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో పురుషులు 20, మహిళలు 03 పోస్టులు ఉన్నాయి.
* వీటిలో హెడ్‌కానిస్టేబుల్(ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సెలర్) పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు డిగ్రీ(సైకాలజీ) లేదా డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 11-11-2022 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,500 నుంచి రూ. 81,100 వరకు చెల్లిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 13-10-2022 మొదలవుతుండగా, 11-11-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..