UGC: విద్యార్ధులకు గుడ్ న్యూస్.. పీజీ లేకుండానే పీహెచ్‌డీలో చేరొచ్చు.. ఎలాగంటే.!
విద్యార్ధులకు ఓ గుడ్ న్యూస్. యూనివర్సీటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) పీహెచ్‌డీ కోర్సుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది..
మీరు బీటెక్, బీఈ, బీ ఫార్మసీ లాంటి కోర్సులు చేశారా.? వీటి తర్వాత పీజీ కాకుండా డైరెక్ట్‌గా పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నారా.? మరి అదెలాగని ఆలోచిస్తున్నారా.. అయితే టెన్షన్ పడకండి.. విద్యార్ధులకు ఓ గుడ్ న్యూస్. యూనివర్సీటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) పీహెచ్‌డీ కోర్సుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు చదవకున్నా.. పీహెచ్‌డీ చేసే అవకాశం పొందొచ్చు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉన్నత విద్యలో మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చేందుకు యూనివర్సీటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో సంబంధం లేకుండానే నేరుగా పీహెచ్‌డీలో చేరే అవకాశాన్ని కల్పించనుంది. దీనికోసం నాలుగేళ్లు లేదా 8 సెమిస్టర్లు ఉన్న డిగ్రీలో కనీసం 75 శాతానికి పైగా ఉత్తీర్ణత సాధించాలి. అలాగే నాలుగేళ్ల డిగ్రీ అనంతరం మాస్టర్స్ డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేసినవారు కూడా ఇందుకు అర్హులని తెలిపింది. దీనిపై యూజీసి త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేయనుంది. అక్టోబర్ మొదటి వారంలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది అమలైతే బీఈ, బీటెక్, బీ ఫార్మసీ తదితర కోర్సులు చేసిన విద్యార్థులు పీహెచ్‌డీలో చేరే అవకాశాన్ని పొందొచ్చు.
ఇదిలా ఉంటే.. పీహెచ్‌డీ కోర్సులు ఏవి కూడా ఆన్‌లైన్ మోడ్ ద్వారా విద్యార్థులకు అందుబాటులో ఉండవని యూనివర్సీటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) పేర్కొంది. అలాగే ప్రస్తుతం, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందాలంటే మాస్టర్స్ డిగ్రీ తప్పనిసరి. ఇదే కాకుండా మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది యూజీసీ.. థీసిస్ సమర్పణకు ముందుగా రీసెర్చ్ పేపర్స్ ప్రచురణ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.