Railway Jobs: స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగాలు.. ఇంటర్ పూర్తి చేసిన వారు అర్హులు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.
Railway Jobs: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ గోరఖ్‌పూర్‌కు చెందిన నార్త్ ఈస్టర్న్ రైల్వేలోని ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలో స్పోర్ట్స్ కోటాలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఖాళీలను ఎలాంటి రాత పరీక్ష లేకుండానే...
Railway Jobs: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ గోరఖ్‌పూర్‌కు చెందిన నార్త్ ఈస్టర్న్ రైల్వేలోని ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలో స్పోర్ట్స్ కోటాలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఖాళీలను ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా గ్రూప్ సీ స్పోర్ట్స్ కోటాలో మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* క్రికెట్, బాస్కెట్‌బాల్, హాకీ, వాలీబాల్, హ్యాండ్ బాల్, రెజ్లింగ్ విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10+2/తత్సమాన ఉత్తీర్ణత పొంది ఉండాలి.
* అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను స్పోర్ట్స్, అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష ఉండదు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 20,200 జీతంగా చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీరణ ప్రక్రియ 26-03-202న ప్రారంభం కాగా 25-04-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Telangana: ఛా.. కనీసం ఇంగితం లేకుండా.. స్కూల్ ముందే.. బెంబేలెత్తిపోయిన విద్యార్థులు
Pink & Yellow Tomatoes: త్వరలో మార్కెట్ లోకి పింక్, పసుపు టొమాటోలు.. మరింత టేస్టీగా మారనున్న కూరలు