AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR Trust UPSC Scholarship 2025: ఎన్‌టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు యూపీఎస్‌సీ మెరిట్‌ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తులు.. పరీక్ష ఎప్పుడంటే?

నారా భువనేశ్వరి నిర్వహిస్తున్న ఎన్‌టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని పేదింటి విద్యార్ధులకు ప్రతీయేట స్కాలర్ షిప్ లు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది తొలిసారిగా యూపీఎస్‌సీ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్షను నిర్వహించేందుకు ప్రకటన జారీ చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ కింది ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు..

NTR Trust UPSC Scholarship 2025: ఎన్‌టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు యూపీఎస్‌సీ మెరిట్‌ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తులు.. పరీక్ష ఎప్పుడంటే?
NTR Trust UPSC Scholarship
Srilakshmi C
|

Updated on: Jan 30, 2025 | 6:48 AM

Share

హైదరాబాద్‌, జనవరి 30: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో మొదటిసారిగా యూపీఎస్‌సీ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఎక్సెల్‌ సివిల్స్‌ అకాడమీ డైరెక్టర్‌ రాజేంద్రకుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. యూపీఎస్‌సీ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష ఫిబ్రవరి 23న ఉదయం 10.30 గంటలకు నిర్వహిస్తారని తెలిపారు. ఇందులో ప్రతిభ ఆధారంగా 75 శాతం దాకా స్కాలర్‌షిప్‌ అందిస్తామన్నారు. పూర్తి వివరాలకు 9100433442, 9100433445 నంబర్లను ఫోన్‌ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

ఇగ్నోలో కొత్తగా ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సు ప్రారంభం.. దరఖాస్తులకు రేపే చివరి రోజు

ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి చేపట్టనున్న అడ్మిషన్లలో భాగంగా నూతనంగా ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సును ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు హైదరాబాద్‌ ప్రాంతీయ కేంద్ర సంచాలకులు డాక్టర్‌ కె రమేశ్‌ తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ ప్రాంతీయ కేంద్రం పరిధిలో ఈ కోర్సును నిజాం కాలేజీలోని అధ్యయన కేంద్రంలో ప్రారంభిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ​​​​​​​ ఇగ్నో అందించే ఎమ్మెస్సీ కెమిస్ట్రీలో ప్రవేశం పొందడానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మూడు లేదా నాలుగేళ్ల బీఎస్సీ డిగ్రీని పూర్తి చేసి ఉండాలని, దీనిని కనీస అర్హతగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఆన్‌లైన్‌ విధానంలో అడ్మిషన్‌ పొందేందుకు జనవరి 31 చివరి తేదీగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అంటే ఈ కోర్సులో ప్రవేశాలు పొందేందుకు రేపే చివరి రోజు. ఇందుకు సంబంధించిన ఇతర వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను లేదా 9492451812, 040- 23117550 ఫోన్‌ నంబర్లను వర్కింగ్‌ రోజుల్లో సంప్రదించవచ్చని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.