NSKTU Recruitment: ఎన్‌ఎస్‌కేటీయూలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక.
NSKTU Recruitment 2021: కేంద్రీయ విశ్వవిద్యాలయమైన నేషనల్ సాంస్క్రీట్ యూనివర్సిటీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఉన్న సంస్థలో...
NSKTU Recruitment 2021: కేంద్రీయ విశ్వవిద్యాలయమైన నేషనల్ సాంస్క్రీట్ యూనివర్సిటీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఉన్న సంస్థలో ఈ ఉద్యోగులను తీసుకోనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 06 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* మొత్తం ఆరు ఖాళీల్లో 04 టీచింగ్, 02 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. * టీచింగ్ పోస్టుల్లో భాగంగా యోగా, అధ్వేత వేదాంత, న్యాయ, విశిష్ఠాధ్వైత వేదాంత విభాగాల్లో.. అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. * నాన్ టీజింగ్ విభాగంలో అసిస్టెంట్ రిజిస్టార్, గ్రూపస్ సీ (ఎంటీఎస్) పోస్టులను భర్తీ చేయనున్నారు. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను అనుసరించి పదో తరగతి, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్/ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులను మొదట అకాడమిక్ అర్హత ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. * ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 08-10-2021కాగా, హార్డ్‌కాపీలను పంపడానికి 14-10-2021 తేదీ చివరి తేదీగా ప్రకటించారు. * హార్డ్ కాపీలను రిజస్ట్రాన్, నేషనల్ సాంస్క్రీట్ యూనివర్సిటీ, తిరుపతి 517507, చిత్తూరు జిల్లా, ఏపీ అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది. * పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Terrorists: కాశ్మీర్ నుంచి జమ్మూకు మకాం మార్చిన ఉగ్రవాదులు..పెరుగుతున్న ఎన్‌కౌంటర్లు