APSFC Recruitment: ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.
APSFC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎఫ్‌సీ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. విజయవాడలో ఉన్న ఈ సంస్థలో పలు విభాగాల్లో కలిపి మొత్తం 23 ఖాళీలను...
APSFC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎఫ్‌సీ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. విజయవాడలో ఉన్న ఈ సంస్థలో పలు విభాగాల్లో కలిపి మొత్తం 23 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ నేటితో ప్రారంభమవుతోన్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 23 ఖాళీలకు గాను మేనేజర్లు (09), డిప్యూటీ మేనేజర్లు (03), అసిస్టెంట్ మేనేజర్లు (11) పోస్టులను భర్తీ చేయనున్నారు. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టులను అనుసరించి సీఏ/ సీఎంఏ/ బీటెక్‌తో పాటు ఎంబీఏ / పీజీడీఎం, బ్యాచిలర్ / పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ లా ఇన్ బిజినెస్/ కమర్షియల్ లా ఉత్తీర్ణతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. * అభ్యర్థుల వయసు 01-08-2021 నాటికి 21 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు…
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * జనరల్ /బీసీ అభ్యర్థులకు రూ. 1003, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ. 590 ఫీజుగా నిర్ధారించారు. * అభ్యర్థులను ఆన్‌లైట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. * ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ నేడు (16-09-2021) ప్రారంభంకాగా.. చివరి తేదీగా 10-10-2021ని నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Acharya Movie: మరోసారి సెట్స్ పైకి ఆచార్య.. ఊటీ బాట పట్టిన చిరు.. చరణ్.. కారణమేంటంటే..