AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 – KAB Education Summit: విద్యా, ఉద్యోగాలపై సందేహాలున్నాయా..? అయితే.. ఎంట్రీ ఫ్రీ.. ఏపీలో రేపటినుంచి ఎడ్యుకేషన్ సమ్మిట్..

Tv9-KAB Education summit: ఆంధ్రప్రదేశ్‌‌లోని విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో టీవీ9 - కేఏబీ ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌ శనివారం నుంచి షురూ కాబోతోంది. విజయవాడలో రెండు రోజులపాటు, వైజాగ్

TV9 - KAB Education Summit: విద్యా, ఉద్యోగాలపై సందేహాలున్నాయా..? అయితే.. ఎంట్రీ ఫ్రీ.. ఏపీలో రేపటినుంచి ఎడ్యుకేషన్ సమ్మిట్..
Tv9 Kab Education Summit
Shaik Madar Saheb
|

Updated on: Sep 17, 2021 | 12:13 AM

Share

Tv9-KAB Education summit: ఆంధ్రప్రదేశ్‌‌లోని విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో టీవీ9 – కేఏబీ ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌ శనివారం నుంచి షురూ కాబోతోంది. విజయవాడలో రెండు రోజులపాటు, వైజాగ్ లో ఒకరోజుపాటు టీవీ9 – కేఏబీ ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌ జరగనుంది. విజయవాడ లబ్బిపేట్‌లోని ఎస్ఎస్ కన్వేన్షన్ హాల్‌లో శని, ఆదివారాల్లో, విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ గదిరాజు ప్యాలెస్‌లో ఆదివారం ఈ సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. కాగా.. ఈ సమ్మిట్‌కు ప్రవేశం ఉచితం. టీవీ9-KAB సంయుక్తంగా ప్రతి ఏడాది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు దిశానిర్దేశం చేసేందుకు ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సదస్సులో విద్య, ఉద్యోగ సమాచారానికి సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రులకున్న సందేహాలను నివృత్తి చేసి.. పలు సలహాలు సూచనలను ఇవ్వనున్నారు. ఈ ఏడాది కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని.. ఎవరికీ, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సదస్సు నిర్వహణ ఏర్పాట్లను పూర్తిచేశారు. టీవీ9, KAB సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్‌లో పలు విద్యా సంస్థలు స్టాల్స్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నాయి.

ఈ సదస్సులో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పలు సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. కరోనా తర్వాత విద్యారంగ పరిస్థితులు, హయ్యర్ ఎడ్యుకేషన్‌కి ఎలాంటి కోర్సులు చేయాలి..? ఏ రంగానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది..? టార్గెట్‌ను రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి.. ప్రిపరేషన్ ఎలా ఉండాలి..? కరోనా కాలంలో ఉన్నత చదువులు ఎలా? ఏ ర్యాంక్‌కు ఎక్కడ సీటు వస్తుంది?.. ఏ కోర్సులు చేస్తే బాగుంటుంది..? ఇలా సందేహం ఏదైనా ఎక్స్‌పర్ట్స్‌ సమాధానం ఇస్తారు. కాగా.. ఈ సమ్మిట్‌కు ప్రవేశం ఉచితం. కౌన్సెలింగ్ కూడా ఫ్రీ.

Education Summit

కరోనా నాటినుంచి విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో కన్ఫ్యూజన్‌తోపాటు మరెన్నో అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అన్నింటినీ క్లియర్‌చేసి భవిష్యత్‌ మార్గనిర్దేశనం చేసేందుకు టీవీ9-KAB ఎడ్యుకేషన్ సమ్మిట్ ఏర్పాటు చేశారు. గత 14 ఏళ్లుగా ప్రతి ఏటా ఈ సమ్మిట్ జరుగుతూ గ్రాండ్ సక్సెస్‌ అవుతోంది. అదే జోష్‌తో ఈసారి టీవీ9-KAB సమ్మిట్‌కు ఏర్పాట్లు గ్రాండ్‌గా పూర్తయ్యాయి. కావున ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని.. ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:

Chardham Yatra 2021: చార్‌ధామ్ యాత్ర చేయాలనుకునే వారికి శుభవార్త! నిషేధం ఎత్తివేసిన కోర్టు.. షరతులు వర్తిస్తాయి!

China Indirect War: ఆస్ట్రేలియా – చైనాల మధ్య కోల్డ్ వార్‌కు కారణమవుతున్న రొయ్యలు..ఎలాగంటే..

మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..