NIT Sikkim Recruitment: ఎన్‌ఐటీ సిక్కిం నాన్‌ టీచింగ్ పోస్టులకు అప్లై చేసుకున్నారా.? దరఖాస్తులకు రేపే చివరి తేదీ..

NIT Sikkim Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్ఐటీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా సిక్కింలోని ఇన్‌స్టిట్యూట్‌లో నాన్‌ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు...

NIT Sikkim Recruitment: ఎన్‌ఐటీ సిక్కిం నాన్‌ టీచింగ్ పోస్టులకు అప్లై చేసుకున్నారా.? దరఖాస్తులకు రేపే చివరి తేదీ..
Nit Sikkim
Follow us

|

Updated on: Dec 05, 2021 | 7:03 AM

NIT Sikkim Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్ఐటీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా సిక్కింలోని ఇన్‌స్టిట్యూట్‌లో నాన్‌ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు రేపటితో (06-12-2021) గడువు ముగియనున్న నేపథ్యంలో. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో రిజిస్ట్రార్, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్, టెక్నికల్‌ అసిస్టెంట్, సూపరింటెండెంట్, జూనియర్‌ అసిస్టెంట్‌ వంటి ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో పదో తరగతితో ఐటీఐ, ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/బీటెక్‌/ఇంజనీరింగ్‌/ఎంసీఏ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వీటితో పాటు సంబంధిత కంప్యూటర్‌ నైపుణ్యాలు ఉండాలి.

* అభ్యర్థుల వయసు 27 నుంచి 56 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని తర్వాత దరఖాస్తును, ఆఫ్‌లైన్‌ విధానంలో పంపించాల్సి ఉంటుంది.

* హార్డ్‌ కాపీని ది రిజిస్ట్రార్, నిట్‌ సిక్కిం, బర్ఫంగ్‌ బ్లాక్, రవంగలా, సౌత్‌ సిక్కిం–737139, సిక్కిం(ఇండియా) చిరునామకు పంపించాలి.

* అభ్యర్థులను రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తులకు రేపే (06-12-2021) చివరి తేదీ.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: US – Sirivennela : ఇలాంటి ఒక రోజు వస్తుందని ఊహించలేదు.. సిరివెన్నెల సీతారామ శాస్త్రికి తెలుగు ఎన్నారైల ఘన నివాళి..

IND VS NZ: ఛెతేశ్వర్‌ పుజారా సిక్స్ కొడితే మీసాలు తీసేస్తా.. హాట్ టాపిక్‌గా మారిన టీమిండియా స్టార్ బౌలర్ ఛాలెంజ్..!

IND VS NZ: ఛెతేశ్వర్‌ పుజారా సిక్స్ కొడితే మీసాలు తీసేస్తా.. హాట్ టాపిక్‌గా మారిన టీమిండియా స్టార్ బౌలర్ ఛాలెంజ్..!

Latest Articles