NEET PG 2024 Schedule: నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!

న్యూఢిల్లీలోని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌) 2024-25 విద్యా సంవత్సరానికి గానూ దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్‌ కాలేజీల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌ పీజీ) 2024 పరీక్ష నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు మే 6వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌ 23వ తేదీన నీట్‌ పీజీ పరీక్ష నిర్వహిస్తారు..

NEET PG 2024 Schedule: నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
NEET PG 2024
Follow us

|

Updated on: Apr 19, 2024 | 7:17 AM

న్యూఢిల్లీలోని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌) 2024-25 విద్యా సంవత్సరానికి గానూ దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్‌ కాలేజీల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌ పీజీ) 2024 పరీక్ష నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు మే 6వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌ 23వ తేదీన నీట్‌ పీజీ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎండీ/ ఎంఎస్‌/ పీజీ డిప్లొమా తదితర మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్‌)-పీజీ 2024కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు తప్పనిసరిగా ఎంబీబీఎస్‌ డిగ్రీ లేదా ప్రొవిజనల్‌ ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే ఏడాది పాటు ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసి ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్‌ లో మే 6, 2024వ తేదీ రాత్రి 11.55 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. పరీక్ష రుసుము కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.3500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.2500 చొప్పున చెల్లించాలి.

రాత పరీక్షా విధానం

నీట్‌ పీజీ 2024 పరీక్ష ఆన్‌లైన్‌లో ఉంటుంది. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కుల చొప్పున కేటాయిస్తారు. ప్రతి తప్పుడు సమాధానానికి 1 మార్కు చొప్పున నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. పరీక్ష మొత్తం మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో జరుగుతుంది. ప్రశ్నాపత్రం కేవలం ఇంగ్లిష్‌ మా«ధ్యమంలో మాత్రమే ఉంటుంది. మొత్తం 3 గంటల 30 నిమిషాల వ్యవధిలో పరీక్ష ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు ఇవే…

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 16, 2024.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: మే 06, 2024.
  • అడ్మిట్‌ కార్డుల విడుదల తేదీ: జూన్‌ 18, 2024.
  • నీట్‌ పీజీ 2024 పరీక్ష తేదీ: జూన్‌ 23, 2024.
  • నీట్‌ పీజీ 2024 పరీక్ష ఫలితాల వెల్లడి తేదీ: జూలై 15, 2024.
  • ఇంటర్న్‌ షిప్‌ కంప్లీషన్‌ కటాఫ్‌ తేదీ: ఆగస్ట్‌ 15, 2024.

నీట్ పీజీ 2024 నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.