Tgwdcw: డిగ్రీ ఉత్తీర్ణతతో మేడ్చల్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే.
మల్కాజిగిరి జిల్లా మేడ్చల్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి..
మల్కాజిగిరి జిల్లా మేడ్చల్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 11 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ప్రొటెక్షన్ ఆఫీసర్ (ఇన్‌స్టిట్యూషనల్ కేర్) (01), ప్రొటెక్షన్ ఆఫీసర్ (నాన్-ఇన్‌స్టిట్యూషనల్ కేర్) (01), లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ (01), సోషల్ వర్కర్ (01), ఔట్‌రీచ్ వర్కర్ (05), ఎస్‌ఏఏ సోషల్ వర్కర్ (02) ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు ధరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, డబ్ల్యూసీడీ & ఎస్సీ, సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం, అంతాయిపల్లి గ్రామం, శామీర్‌పేట్ మండలం, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు 19-12-2022 చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..