KVS Class 1 Admission 2024: నేటి నుంచి కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 ఒకటో తరగతి అడ్మిషన్లు ప్రారంభం.. ఆన్‌లైన్ దరఖాస్తులు షురూ
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 1254 కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఒకటో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం (ఏప్రిల్ 1) నుంచి ప్రారంభమైంది. ఒకటో తరగతికి మాత్రమే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు అనుమతిస్తున్నారు. రెండు, ఆపై తరగతుల వారికి ఆఫ్‌లైన్ విధానంలో..
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 1254 కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఒకటో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం (ఏప్రిల్ 1) నుంచి ప్రారంభమైంది. ఒకటో తరగతికి మాత్రమే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు అనుమతిస్తున్నారు. రెండు, ఆపై తరగతుల వారికి ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఏప్రిల్ 15 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువుగా నిర్ణయించారు. ఇక ఒకటో తరగతి ప్రవేశాలు పొందగోరే చిన్నారుల వయసు మార్చి 31 నాటికి తప్పని సరిగా ఆరేళ్లు పూర్తై ఉండాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుల్లో విద్యార్ధులు తల్లిదండ్రులు ఎంచుకున్న ప్రయారిటీ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానికత ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం సీట్లను కేటాయిస్తారు. ఎలాంటి ఎంట్రన్స్ టెస్ట్ ఉండదు. ఒకటో తరగతి కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్ధుల తొలి ప్రొవిజినల్ లిస్ట్ ఏప్రిల్ 19న విడుదల అవుతుంది. షెడ్యూల్ ప్రకారం రెండో ప్రొవిజినల్ లిస్ట్ ఏప్రిల్ 29న, మూడో ప్రొవిజినల్ లిస్ట్ మే 8న విడుదల చేయనున్నారు. రెండో తరగతితో పాటు ఆపై తరగతులకు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 1 ఉదయం 8 గంటల నుంచి ఏప్రిల్10 వ తేదీ సాయంత్రం 4గంటల వరకు అవకాశం ఉంటుంది. సంబంధిత కేంద్రీయ విద్యాలయకు వెళ్లి ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
పదో తరగతి ఫలితాలు విడుదలైన పది రోజుల తర్వాత నుంచి 11వ తరగతికి అడ్మిషన్లు ప్రారంభం అవుతాయి. దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాలలో అడ్మిషన్ల కోసం సోమవారం (ఏప్రిల్ 1) నుంచి ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. విద్యార్ధులు తగిన డాక్యుమెంట్లతో గడువు తేదీ ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.