JEE Main 2024 Admit Cards: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 అడ్మిట్‌ కార్డులు విడుదల.. ఇక్కడ నేరుగా డౌన్ లోడ్ చేసుకోండి

దేశ వ్యాప్తంగా ఉన్ ప్రతిష్టాత్మక ఎన్ఐటీలు, ఇతర ప్రఖ్యాత ఇంజనీరింగ్‌ సంస్థల్లో బీటెక్‌ , బీఆర్క్‌, బీఈ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్స్ 2024 సెషన్ 2 అడ్మిట్‌ కార్డులు సోమవారం (ఏప్రిల్ 1న) విడుదలయ్యాయి. ఈ మేరకు నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటన విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జేఈఈ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కార్డులు డౌన్‌ లోడ్‌..

JEE Main 2024 Admit Cards: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 అడ్మిట్‌ కార్డులు విడుదల.. ఇక్కడ నేరుగా డౌన్ లోడ్ చేసుకోండి
JEE Main 2024 Admit Cards
Follow us

|

Updated on: Apr 01, 2024 | 3:02 PM

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: దేశ వ్యాప్తంగా ఉన్ ప్రతిష్టాత్మక ఎన్ఐటీలు, ఇతర ప్రఖ్యాత ఇంజనీరింగ్‌ సంస్థల్లో బీటెక్‌ , బీఆర్క్‌, బీఈ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్స్ 2024 సెషన్ 2 అడ్మిట్‌ కార్డులు సోమవారం (ఏప్రిల్ 1న) విడుదలయ్యాయి. ఈ మేరకు నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటన విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జేఈఈ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కార్డులు డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యర్ధులు అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, కోర్సు, సెక్యూరిటీ పిన్‌ నమోదు చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా జేఈఈ మెయిన్‌ తుది విడత పరీక్షలు ఏప్రిల్ 4, 5, 6, 8, 9, 12 తేదీల్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఇంజనీరింగ్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్‌ స్కోర్‌ కీలకం. జేఈఈ మెయిన్‌ పరీక్షను ఏటా రెండు దఫాలుగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు సార్లు పరీక్ష రాసిన వారికి బెస్ట్ స్కో్ర్ ఎందులో వస్తే ఆ మార్కులను ప్రామాణికంగా చేసుకుని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలకు అనుమతిస్తారు. ఇప్పటికే అభ్యర్ధులు ఫుల్ ప్రిపరేషన్‌లో ఉన్నారు. ఏప్రిల్‌ 4 నుంచి ఆరు రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి.

జేఈఈ మెయిన్‌ 2024 సెషన్‌ 2 అడ్మిట్‌ కార్డు కోసం క్లిక్‌ చేయండి.

ఐబీపీఎస్ పీఓ తుది ఫలితాలు విడుదల

ఐబీపీఎస్‌ నిర్వహించిన ప్రొబెషనరీ ఆఫీసర్‌, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల రాత పరీక్షకు సంబంధించిన తుది ఫలితాలు సోమవారం (ఏప్రిల్‌ 1) విడుదలయ్యాయి. మెయిన్స్‌ లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా తుది ర్యాంకును నిర్ణయిస్తారు. అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. మొత్తం 3,049 పోస్టులకు గానూ ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. ఎంపికైన అభ్యర్ధుల వివరాలు ఐబీపీఎస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

ఇవి కూడా చదవండి

ఐబీపీఎస్‌ ప్రొబెషనరీ ఆఫీసర్‌, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల తుది ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

సొంతింటి కల..నెరవేర్చుకోండిలా..!
సొంతింటి కల..నెరవేర్చుకోండిలా..!
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.