Engineering Counselling: ఐడీపీ కోర్సులకు జేఎన్టీయూ మంగళం.. కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్లు తొలగింపు
ఇంటిగ్రేటెడ్, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ (ఐడీపీ)కి చెందిన నాలుగు కోర్సులకు మంగళం పాడింది. ఏఐసీటీఈ అనుమతి రానందున వీటిని రద్దుచేస్తున్నట్లు పేర్కొంది. 2003లో జేఎన్టీయూ మెకానికల్, సివిల్, సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ.. వంటి ఐదు కోర్సులను ప్రారంభించింది. ఇవన్నీ నాలుగేళ్ల బీటెక్, ఏడాది ఎంటెక్‌తో కూడిన..

హైదరాబాద్, జులై 10: జేఎన్టీయూ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటిగ్రేటెడ్, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ (ఐడీపీ)కి చెందిన నాలుగు కోర్సులకు మంగళం పాడింది. ఏఐసీటీఈ అనుమతి రానందున వీటిని రద్దుచేస్తున్నట్లు పేర్కొంది. 2003లో జేఎన్టీయూ మెకానికల్, సివిల్, సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ.. వంటి ఐదు కోర్సులను ప్రారంభించింది. ఇవన్నీ నాలుగేళ్ల బీటెక్, ఏడాది ఎంటెక్‌తో కూడిన ఐడీపీ కోర్సులు. ఏఐసీటీఈ నుంచి అనుమతి లేకుండానే ప్రారంభించింది. మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సుకు మాత్రం ఐదేళ్ల తర్వాత అనుమతి లభించింది. మిగతా నాలుగు కొర్సులకు ఏఐసీటీఈ అనుమతి నిరాకరించింది. అయినా వాటిని 15 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ కోర్సులకు అనుమతి తీసుకొచ్చేందుకు మరోమారు ప్రయత్నించగా ఒక కోర్సుకు మాత్రమే అనుమతి ఉంటుందని ఏఐసీటీఈ తేల్చి చెప్పింది.
దీనిపై వీసీ ప్రొఫెసర్ టికేకే రెడ్డి, ప్రిన్సిపల్స్, అన్ని విభాగాల అధినేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో ఐడీపీ కోర్సులను తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. వాటి స్థానంలో కొత్తగా నాలుగేళ్ల బీటెక్ కోర్సులు ప్రత్యమ్నాయంగా ప్రారంభించేందుకు అవకాశాలను పరిశీలించాలని సూచించారు. మెకానికల్‌లో మాత్రమే ప్రవేశాలు కల్పించి, అనుమతి లేని సివిల్, సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ కోర్సులను రద్దు చేశారు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల్లో వెబ్‌ఆప్షన్ల నుంచి వాటిని తొలగించారు. కేవలం బీటెక్ మెకానికల్ ప్లస్ ఎంటెక్ అడ్వాన్స్డ్ మ్యానుఫాక్చరింగ్ సిస్టమ్స్ ఎంటెక్ థర్మల్ ఇంజినీరింగ్‌లో మాత్రమే 60 సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్ ఇచ్చారు.
తెలంగాణ అగ్రి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు కౌన్సెలింగ్ ప్రారంభం
తెలంగాణలోని వ్యవసాయ యూనివర్సిటీ పరిధిలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో 2025-26 సంవత్సరానికి సంబంధించి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ జులై 8న ప్రారంభమైంది. తొలి సీటు పొందిన శ్రీవర్ధన్‌కు వర్సిటీ రిజిస్ట్రార్ విద్యాసాగర్ కేటాయింపు పత్రాన్ని అందజేశారు. తొలిరోజు 60 మందికి సీట్లను కేటాయించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




