IB ACIO Recruitment 2023: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 226 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువు

న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో.. దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 226 పోస్టులను భర్తీ చేయనున్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో 79 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్..

IB ACIO Recruitment 2023: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 226 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువు
Intelligence Bureau
Follow us
Srilakshmi C

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 24, 2023 | 5:16 PM

న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో.. దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 226 పోస్టులను భర్తీ చేయనున్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో 79 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ విభాగంలో 147 పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు జనవరి 12వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.

ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలి-కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్ స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్‌ డిగ్రీ లేదా ఎలక్ట్రానిక్స్/ ఫిజిక్స్- ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్/ కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్‌లో ఎంఎస్సీ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే గేట్ 2021/ 2022/ 2023లో ఏదైనా ఒకదానిలో స్కోరు సాధించి ఉండాలి. జనవరి 12, 2024 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.దరఖాస్తు రుసుము కింద జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. గేట్ స్కోరు/ ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్/ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.44,900 నుంచి 1,42,400 వరకు జీతంగా చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు…

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు ప్రారంభ తేదీ: డిసెంబర్‌ 23, 2023.
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 12, 2024.
  • దరఖాస్తు రుసుము చెల్లింపు చివరి తేదీ: జనవరి 16, 2024.

ఖాళీల వివరాలు..

  • అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2/ టెక్నికల్‌: 226 పోస్టులు
  • యూఆర్‌ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 93
  • ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 24
  • ఓబీసీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 71
  • ఎస్సీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 29
  • ఎస్టీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 9

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కొత్త అవతారం ఎత్తిన మాజీ కెప్టెన్! శాంటాక్లాజ్‌ కాదు తలా క్లాజ్
కొత్త అవతారం ఎత్తిన మాజీ కెప్టెన్! శాంటాక్లాజ్‌ కాదు తలా క్లాజ్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..