IIT Recruitment: ఐఐటీలో టీచింగ్ పోస్టుల భర్తీ.. నెలకు రూ. 2 లక్షలకు జీతం పొందే అవకాశం.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఖరగ్‌పూర్ క్యాంపస్‌లో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి..? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఖరగ్‌పూర్ క్యాంపస్‌లో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి..? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* మెకానికల్ సైన్సెస్, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, ఆర్కిటెక్చర్ డిజైన్ అండ్ ప్లానింగ్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, నానో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల్లో ఈ టీచింగ్ పోస్టులు ఉన్నాయి.
* ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో కనీసం 10 ఏళ్ల అనుభవం ఉండాలి.
* అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. కనీసం 06 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
* అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కనీసం 03 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
* అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.101500-రూ.220200 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 28-02-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..