IIT Kharagpur Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు అలర్ట్‌! నెలకు లక్షకుపైగా జీతంతో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఉద్యోగాలు.. పూర్తివివరాలు..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఖరగ్‌పూర్‌ (IIT Kharagpur) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టు (Project Staff Posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

IIT Kharagpur Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు అలర్ట్‌! నెలకు లక్షకుపైగా జీతంతో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఉద్యోగాలు.. పూర్తివివరాలు..
Iit Kharagpur
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 17, 2022 | 10:09 AM

IIT Kharagpur Jobs: భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఖరగ్‌పూర్‌ (IIT Kharagpur) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టు (Project Staff Posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 10

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు

ఖాళీల వివరాలు: జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌), జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌ (స్ట్రాటజిక్‌ అండ్‌ ఔట్‌రీచ్‌), సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (ఎస్‌ఆర్‌ఎఫ్‌), బిజినెస్‌ మేనేజర్‌ (ప్రాజెక్ట్‌ మేనేజర్‌), అసిస్టెంట్‌ మేనేజర్‌ (అడ్మిన్‌ అండ్‌ అకౌంట్స్‌)

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.25,000ల నుంచి రూ.1,25,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌, ఎంబీఏ/మాస్టర్‌ డిగ్రీ/పీజీడీఎం, ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతోపాటు గేట్‌ అర్హత కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, లాంగ్వేజ్‌ ప్రొఫిషెన్సీ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 3, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

RBI Assistant Recruitment 2022: ఆర్బీఐలో 950 అసిస్టెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం..