IIT Hyderabad Recruitment: హైదరాబాద్ ఐఐటీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు… ఎవరు అర్హులంటే.?
IIT Hyderabad Recruitment: హైదరాబాద్ ఐఐటీ పలు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్ శివారుల్లో సంగారెడ్డికి సమీపంలో ఉన్న...
IIT Hyderabad Recruitment: హైదరాబాద్ ఐఐటీ పలు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్ శివారుల్లో సంగారెడ్డికి సమీపంలో ఉన్న ఈ క్యాంపస్‌లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* మొత్తం 24 ఖాళీలకు గాను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సీనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ మెడికల్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్, జూనియర్ టెక్నీషియన్, మల్టీ స్కిల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. * పైన తెలిపిన ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ/బీటెక్/ ఎంసీఏ, మాస్టర్స్ డిగ్రీ, ఎంఈ/ఎంటెక్, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. * సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి. * అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి నెలకు రూ. 18000 నుంచి రూ. 208700 వరకు అందిస్తారు. * అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్/ స్కిల్ టెస్ట్ / రాత పరీక్ష / ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. * దరఖాస్తుల స్వీకరణకు 11-10-2021 చివరి తేదీగా నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..