IISc PG, PhD Admissions 2022: ఈ ఏడాది నుంచి ఐఐఎస్సీ బెంగళూరులో కొత్తగా MSc, MTech కోర్సులు ప్రారంభం..
బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc Bangalore) 2022-23 విద్యాసంవత్సరం నుంచి కొన్ని కొత్త ప్రోగ్రామ్‌లను ప్రారంభిస్తోంది. లైఫ్ సైన్సెస్, కెమికల్ సైన్స్ విభాగాల్లో..
IISC Bangalore Admission Notification 2022-23: బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc Bangalore) 2022-23 విద్యాసంవత్సరం నుంచి కొన్ని కొత్త ప్రోగ్రామ్‌లను ప్రారంభిస్తోంది. తాజా అడ్మిషన్ నోటిఫికేషన్ ప్రకారం లైఫ్ సైన్సెస్, కెమికల్ సైన్స్ విభాగాల్లో ఎమ్మెస్సీ, బయో ఇంజనీరింగ్‌లో ఎంటెక్ కోర్సులను ప్రారంభిస్తుంది. ఈ కొత్త కోర్సులతోపాటు 2022 ఆగస్ట్ సెషన్‌లో పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకుగాను రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అర్హత కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ iisc.ac.in/admissionsలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్లకు చివరితేదీ మార్చి 22. ఇక ఈ ఏడాది పీహెచ్‌డీ, ఎంటెక్ (MTech), ఎండీఈఎస్ (MDes), ఎమ్‌ఎమ్‌జీటీ (MMgt), లైఫ్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్‌లో ఎమ్మెస్సీ (MSc), ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో విద్యార్ధులు అడ్మిషన్లు పొందవచ్చు. ఈ కోర్సులకు సంబంధించిన అర్హత ప్రమాణాలు, స్పెషలైజేషన్‌లు, పరిశోధన రంగాలు, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
డిగ్రీ చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలు రాసే విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే జూలై 31, అక్టోబర్ 31లోపు అవసరమైన సర్టిఫికేట్లన్నింటినీ సబ్‌మిట్ చేసినవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. కాగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ప్రవేశాలకు గాను ఆల్ ఇండియా ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ప్రతిభ కనపరచిన విద్యార్ధులకు మాత్రమే ఆయా కోర్సుల్లో ప్రవేశాలు లభిస్తాయి.
Applications are open for admissions to PG/PhD programmes for 2022-23. We have exciting new programmes starting this year, including MSc in Life Sciences and Chemical Sciences, and MTech in Bioengineering. Apply now! https://t.co/OefGigEUUL#IIScadmissions #WhyIISc pic.twitter.com/zfSNSJxUZE
— IISc Bangalore (@iiscbangalore) February 18, 2022
Also Read: