AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IDBI Admit Cards: ఐడీబీఐ బ్యాంకు జేఏఎం/ ఎగ్జిక్యూటివ్ రాత పరీక్షలకు అడ్మిట్‌ కార్డులు విడుదల.. పరీక్ష తేదీలివే

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ బ్యాంక్‌ లిమిటెడ్‌) జేఏఎం, ఎగ్జిక్యూటివ్ పోస్టులు రాత పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో జేఏఎం పోస్టులకు డిసెంబర్‌ 31న పరీక్ష..

IDBI Admit Cards: ఐడీబీఐ బ్యాంకు జేఏఎం/ ఎగ్జిక్యూటివ్ రాత పరీక్షలకు అడ్మిట్‌ కార్డులు విడుదల.. పరీక్ష తేదీలివే
IDBI Admit Cards
Srilakshmi C
|

Updated on: Dec 25, 2023 | 6:56 AM

Share

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 24: ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ బ్యాంక్‌ లిమిటెడ్‌) జేఏఎం, ఎగ్జిక్యూటివ్ పోస్టులు రాత పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో జేఏఎం పోస్టులకు డిసెంబర్‌ 31న పరీక్ష జరగనుంది. ఇక ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు డిసెంబర్‌ 30న రాత పరీక్ష జరుగుతుంది. ఈ రెండు పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలోనే జరుగుతాయి. ఆన్‌లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 800 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (జేఏఎం), 1300 ఎగ్జిక్యూటివ్‌ (సేల్స్ అండ్ ఆపరేషన్స్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన వారికి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టులకైతే ఏడాదికి రూ.6.14 – రూ.6.50 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు నెలకు రూ.29,000 నుంచి రూ.31,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

జనవరి 23 నుంచి ఆంధ్రప్రదేశ్‌ పాఠశాలలకు ఫార్మెటివ్‌-3 పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌ పాఠశాలలకు ఫార్మెటివ్‌-3 పరీక్షలను జనవరి 23 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలు అదే నెల 29 వరకు నిర్వహించనున్నారు. 1 నుంచి 8 తరగతులకు తరగతి ఆధారిత మదింపు (సీబీఏ) పరీక్ష, 9,10 తరగతులకు ఫార్మెటివ్‌-3 నిర్వహించనున్నారు. 1 నుంచి 5 తరగతులకు జనవరి 23 నుంచి 27 వరకు, 6 నుంచి 10 తరగతులకు జనవరి 29 వరకు పరీక్షలు కొనసాగుతాయి.

ఏపీ ఎస్సై ఉద్యోగాలకు తుది ఎంపిక జాబితా విడుదల.. మొత్తం ఎంత మంది ఎంపికయ్యారంటే..

ఆంధ్రప్రదేశ్‌ ఎస్సై ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను పోలీసు నియామక మండలి డిసెంబరు21న విడుదల చేసిన సంగతి తెలిసిందే. సివిల్‌ ఎస్సై ఉద్యోగాలకు మొత్తం 315 పోస్టులకు అభ్యర్థులు ఎంపిక అయ్యారు. వారిలో 102 మంది మహిళలున్నారు. ఆర్‌ఎస్సై విభాగంలోని 96 పోస్టులకు కూడా ఎంపికైన అభ్యర్థుల వివరాలను విడుదల చేసింది. ఎంపికైన వారి హాల్‌టికెట్‌ నంబర్లు, కేటగిరీల వారీగా కటాఫ్‌ మార్కులు, జోన్ల వారీగా ఎంపిక జాబితాను వెబ్‌సైట్‌లో బోర్డు అందుబాటులో ఉంచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.