CSEET 2022 July రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం.. పరీక్ష ఎప్పుడంటే..

సీఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు నిర్వహించే కంపెనీ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్ (CSEET 2022 July) రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యింది..

CSEET 2022 July రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం.. పరీక్ష ఎప్పుడంటే..
Registration
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 20, 2022 | 8:06 AM

ICSI CSEET July 2022 exam date: సీఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు నిర్వహించే కంపెనీ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్ (CSEET 2022 July) రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI) ప్రారంభించింది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ icsi.eduలో జూన్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సీఎస్‌ఈఈటీ టెస్ట్‌ జూలై 9న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించబడుతుంది. 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్ధులెవరైనా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా గత ఏడాది సీఎస్‌ఈఈటీ టెస్ట్‌ అర్హత ప్రమాణాలను ఐసీఎస్‌ఐ సవరించింది. సవరణల ప్రకారం.. గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివిన విద్యార్ధులు ఇకపై సెక్రటరీ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్ హాజరుకానవసరం లేదు. నేరుగా సీఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఇక ఈ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకునే జనరల్‌ అభ్యర్ధులు రూ.1000లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.500లు దరఖాస్తు రుసుము విధిగా చెల్లించవల్సి ఉంటుంది.

Also Read:

TS govt Jobs 2022: తెలంగాణ వర్సిటీల్లో కోచింగ్‌ క్లాసులు షురూ! నేడే ప్రారంభం..