IBPS Clerk Notification 2024: ఐబీపీఎస్‌ క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఈ సారి భారీగా పెరిగిన పోస్టులు

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (ఐబీపీఎస్‌) 2025-2026 సంవత్సరానికి సంబంధించి కామ‌న్ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్ (సీఆర్‌పీ)-XIV నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఐబీపీఎస్‌ క్లర్క్‌ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 6128 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భ‌ర్తీకి దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం లభించినట్లైంది..

IBPS Clerk Notification 2024: ఐబీపీఎస్‌ క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఈ సారి భారీగా పెరిగిన పోస్టులు
IBPS Clerk Notification
Follow us

|

Updated on: Jul 01, 2024 | 3:05 PM

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (ఐబీపీఎస్‌) 2025-2026 సంవత్సరానికి సంబంధించి కామ‌న్ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్ (సీఆర్‌పీ)-XIV నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఐబీపీఎస్‌ క్లర్క్‌ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 6128 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భ‌ర్తీకి దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం లభించినట్లైంది. ఈ మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోనూ భారీగా ఖాళీలున్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు జులై 1, 2024 నాటికి 20 నుంచి 28 యేళ్ల మధ్య ఉండాలి. అంటే దరఖాస్తుదారులు జులై 2, 1996 నుంచి జులై 1, 2004 మధ్య జన్మించి ఉండాలి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో జులై 1వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు జులై 21, 2024 చివరి తేదీ. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎమ్‌ఎమ్‌, డీఈఎస్‌ఎమ్‌ అభ్యర్ధులు మాత్రం రూ.175 రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద చెల్లిస్తే సరిపోతుంది. ప్రిలిమిన‌రీ, మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

రాత పరీక్ష విధానం..

ఐబీపీఎస్‌ క్లర్క్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష 100 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 100 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. మెయిన్స్‌ పరీక్ష మొత్తం 200 మార్కులకు రెండు గంటల సమయంలో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు…

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జులై 01,2024
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 21, 2024
  • ప్రీ-ఎగ్జామ్‌ ట్రైనింగ్‌ నిర్వహణ తేదీలు: ఆగస్టు 12 నుంచి 17 వరకు
  • ఆన్‌లైన్‌ ప్రిలిమిన‌రీ పరీక్షలు: ఆగస్టు 24, 25, 31 తేదీల్లో
  • ప్రిలిమిన‌రీ పరీక్ష ఫలితాల విడుదల తేదీ: సెప్టెంబర్‌ 2024లో
  • ఆన్‌లైన్‌ మెయిన్ పరీక్షలు: అక్టోబర్‌ 13, 2024.

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

కేరళ కళాకారుడి చేతిలో ప్రధాని మోదీ అద్భుతమైన విగ్రహం..ఎత్తు, రూపు
కేరళ కళాకారుడి చేతిలో ప్రధాని మోదీ అద్భుతమైన విగ్రహం..ఎత్తు, రూపు
ఓటీటీ డీల్ సెట్ అయితే తప్ప నో రిలీజ్.. ఆ హీరోలకి డిజిటల్ కష్టాలు
ఓటీటీ డీల్ సెట్ అయితే తప్ప నో రిలీజ్.. ఆ హీరోలకి డిజిటల్ కష్టాలు
పోలీసులను చూసి లారీ వదిలేసి పరార్.. వాహనంలో ఏముందా అని చూడగా
పోలీసులను చూసి లారీ వదిలేసి పరార్.. వాహనంలో ఏముందా అని చూడగా
హత్రాస్ మృత్యుఘోశ.. మృతదేహాలను కానిస్టేబుల్‌ గుండెపోటుతో మృతి..
హత్రాస్ మృత్యుఘోశ.. మృతదేహాలను కానిస్టేబుల్‌ గుండెపోటుతో మృతి..
ప్రతిరోజూ సైకిల్ తొక్కండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి..! ప్రయోజనాలు
ప్రతిరోజూ సైకిల్ తొక్కండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి..! ప్రయోజనాలు
"ముందు దేశభక్తుడిగా మారు..": పరాగ్‌కి ఇచ్చిపడేసిన శ్రీశాంత్
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. స్పీడు పెంచిన పోలీసులు
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. స్పీడు పెంచిన పోలీసులు
ధనుష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా.? సూర్య స్క్రిప్ట్ ఆయనకి షిఫ్ట్.?
ధనుష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా.? సూర్య స్క్రిప్ట్ ఆయనకి షిఫ్ట్.?
మరోసారి విజయ్‌కు జోడీగా నేషనల్ క్రష్..
మరోసారి విజయ్‌కు జోడీగా నేషనల్ క్రష్..
నగరంలో డ్రగ్స్, గంజాయి అమ్మకాల్లో వీరిపాత్ర కీలకం..
నగరంలో డ్రగ్స్, గంజాయి అమ్మకాల్లో వీరిపాత్ర కీలకం..