బ్యాంకు ఉద్యోగాలపై కన్నేసిన అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే ఆన్‌లైన్ దరఖాస్తులు
IBPS PO Recruitment 2026: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీగా ప్రొబేషనరీ ఆఫీసర్ (PO), మేనేజ్‌మెంట్ ట్రైనీ (MT) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తదితర బ్యాంకుల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎవరైనా ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు..

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS).. వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులలో రెగ్యులర్ ప్రాతిపదికన భారీ సంఖ్యలో ప్రొబేషనరీ ఆఫీసర్స్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 6,715 ప్రొబేషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు జులై 1, 2026వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో పోస్టుల సంఖ్య: 1900
- బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పోస్టుల సంఖ్య: 500
- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పోస్టుల సంఖ్య: 1100
- కెనరా బ్యాంక్‌లో పోస్టుల సంఖ్య: 1500
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పోస్టుల సంఖ్య: 500
- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో పోస్టుల సంఖ్య: 550
- పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో పోస్టుల సంఖ్య: 504
- పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో పోస్టుల సంఖ్య: 161
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగాల్లో డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు నిబంధనల మేరకు వయోసడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జులై 21, 2026వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.175, ఇతర జనరల్ అభ్యర్ధులు రూ.850 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ఆయా బ్యాంకుల్లో విధులు కేటాయిస్తారు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి.
ఐబీపీఎస్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




