HSL Visakhapatnam Jobs 2022: విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో 40 మేనేజర్‌ ఉద్యోగాలు..రాతపరీక్ష లేకుండానే..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (HSL) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

HSL Visakhapatnam Jobs 2022: విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో 40 మేనేజర్‌ ఉద్యోగాలు..రాతపరీక్ష లేకుండానే..
Hsl Visakhapatnam
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 03, 2022 | 9:32 PM

Hindustan Shipyard Limited Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (HSL) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 40

పోస్టుల వివరాలు: జనరల్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, డిప్యూటీ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌.. ఇతర పోస్టులు.

విభాగాలు: హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌, టెక్నికల్‌, కమర్షియల్‌, సివిల్‌, అడ్మినిస్ట్రేషన్‌.

పే స్కేల్‌: నెలకు రూ.52,000 నుంచి రూ.2,20,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌, బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. టెక్నికల్‌ నాలెడ్జ్‌ అవసరం.

ఎంపిక విధానం: గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌ అభ్యర్ధులు: రూ.300
  • ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌డబ్ల్యూ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2022, మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 25 వరకు.

హార్డు కాపీలను పంపడానికి చివరి తేదీ: 2022, ఏప్రిల్‌ 5 నుంచి ఏప్రిల్‌ 25 వరకు.

అడ్రస్‌: General Manager (HR), Hindustan Shipyard Ltd, Gandhinagar (PO), Visakhapatnam 530005.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

TISS Mumbai Jobs 2022: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. టిస్‌ ముంబాయిలో రీసెర్చ్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు..అర్హతలివే!