HAL Recruitment 2022: నాసిక్- హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో భారీగా అప్రెంటీస్ ఖాళీలు.. ఈ అర్హతలుంటే నేరుగా అవకాశం..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన మహారాష్ట్రలోని నాసిక్‌లోనున్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL).. తాత్కాలిక ప్రాతిపదికన అప్రెంటిస్ ట్రైనీగా పోస్టుల (Medical Staff posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..
HAL Nasik Apprenticeship Training Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన మహారాష్ట్రలోని నాసిక్‌లోనున్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL).. తాత్కాలిక ప్రాతిపదికన అప్రెంటిస్ ట్రైనీగా పోస్టుల (Medical Staff posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్ధులు ఏడాదిపాటు ట్రైనీ అప్రెంటిస్‌గా పనిచేయవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
ఖాళీల సంఖ్య: 178
ఖాళీల వివరాలు:
- ఇంజినీరింగ్/గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఖాళీలు: 99
- టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ ఖాళీలు: 79
విభాగాలు: ఏరోనాటికల్ ఇంజినీర్, కంప్యూటర్ ఇంజినీర్, సివిల్ ఇంజినీర్, ఎలక్ట్రికల్ ఇంజినీర్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్, మెకానికల్ ఇంజినీర్, ప్రొడక్షన్ ఇంజినీర్, ఫార్మాసిస్ట్, నర్సింగ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, హోటల్ మేనేజ్‌మెంట్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయోపరిమితి: జనవరి 31, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.9000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ (నర్సింగ్), ఇంజినీరింగ్/టెక్నాలజీ/హోటల్ మేనేజ్‌మెంట్/మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ స్పెషలైజేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 10, 2022.
సర్టిఫికేట్ల వెరిఫికేషన్ తేదీలు: ఆగస్టు 16 నుంచి 31 వరకు, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.