Layoffs: టెక్ రంగంలో మరోసారి అలజడి.. వందల మందిని తొలగించిన టెక్ దిగ్గజం
తాజాగా ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి పెద్దగా వార్తలు రావడం లేదు. చిన్నాచితన కంపెనీలే మినహాయిస్తే పెద్ద కంపెనీలేవి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు దాఖలాలు లేవు. అయితే తాజాగా టెక్ దిగ్గజం గూగుల్ తమ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన అల్ఫాబెట్ ఉద్యోగులను తొలగించించింది. ఏకంగా వందల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపినట్లు ప్రముఖ వార్త సంస్థ రాయిటర్స్ తెలిపింది...
ఆర్థిక మాంద్యం తాలుకూ భయాలు ఇంకా పోలేవు. మొన్నటి వరకు వేలాది మందిని ఇంటికి పంపించి టెక్ దిగ్గజాలు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. చిన్న చిన్న స్టార్టప్‌లు మొదలు బడా సాఫ్ట్‌వేర్ కంపెనీల వరకు ఉద్యోగులను నిర్ధాక్షణ్యంగా ఉద్యోగం నుంచి తొలగించాయి. దీంతో రాత్రికి రాత్రే ఉద్యోగుల జీవితాలు రోడ్డున పడ్డాయి. లక్షల్లో జీతాలు వచ్చే ఉద్యోగుల జీవితాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి.
అయితే తాజాగా ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి పెద్దగా వార్తలు రావడం లేదు. చిన్నాచితన కంపెనీలే మినహాయిస్తే పెద్ద కంపెనీలేవి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు దాఖలాలు లేవు. అయితే తాజాగా టెక్ దిగ్గజం గూగుల్ తమ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన అల్ఫాబెట్ ఉద్యోగులను తొలగించించింది. ఏకంగా వందల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపినట్లు ప్రముఖ వార్త సంస్థ రాయిటర్స్ తెలిపింది.
అల్భాబెట్‌కు సంస్థలోని హ్యూమన్ రీసోర్స్ విభాగంలో ఈ తొలగింపు ఉన్నట్లు రాయిటర్స్ పేర్కొంది. వీరిలో చాలా మంది గ్లోబల్ రిక్రూట్‌మెంట్ టీమ్ నుంచి ఉన్నట్లు వెల్లడించింది. ఇక ఇప్పటికే ఉన్న ఉద్యోగులను తొలగించడంతో పాటు కొత్త ఉద్యోగుల నియామకాన్ని కూడా అల్ఫాబెట్ పూర్తిగా తగ్గించినట్లు తెలిపింది. తొలగింపునకు సంబంధించి ఉద్యోగులకు సంస్థ బుధవారం మెయిల్స్ పంపించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం త్రైమాసికంలో లేఆఫ్స్ ప్రకటించిన అతిపెద్ద టెక్ కంపెనీ అల్ఫాట్ కావడం టెక్ రంగంలో చర్చనీయాంశంగా మారింది. ఇక టెక్ రంగంలో ఉద్యోగుల తొలగింపు 2023 నుంచే కొనసాగుతోంది. ఆ ఏడాదిలో మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు ఉద్యోగులను భారీ ఎత్తున తొలగించిన విషయం తెలిసిందే. అల్ఫాబెట్ కూడా ఏడాది ఏకంగా 12 వేల మందిని ఇంటికి పంపించింది.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..