AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP EAPCET 2026 విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో వారంలోనే కౌన్సెలింగ్ షురూ

AP EAPCET 2026 Counselling Schedule: రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ఈఏపీసెట 2026 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఎట్టకేలకు విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ 2026 రాసిన విద్యార్దులందరూ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు..

AP EAPCET 2026 విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో వారంలోనే కౌన్సెలింగ్ షురూ
AP EAPCET Counselling Set to Start Next Week
Srilakshmi C
|

Updated on: Jul 07, 2026 | 2:56 PM

Share

అమరావతి, జులై 7: ఇప్పటికే ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదలవడంతో ర్యాంకుల కేటాంపు కూడా పూర్తయింది. షెడ్యూల్‌ ప్రకారం కౌన్సెలింగ్ ప్రక్రియ జులై 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఉన్నత విద్యామండలి త్వరలోనే కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తి తేదీలను ప్రకటించనుంది. కళాశాలల అనుబంధ గుర్తింపును త్వరగా పూర్తిచేసి, కౌన్సెలింగ్‌ చేపట్టాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఈ ఏడాది ఇంజినీరింగ్‌ కాలేజీలకు కనీస ఫీజును రూ.40 వేల నుంచి రూ.47 వేలకు పెంచింది.

2014-19 మధ్య ఇంజనీరింగ్‌ కనీస ఫీజును రూ.45 వేలకు పెంచిన సర్కార్.. ఆ తర్వాత గత ప్రభుత్వం హయాంలో రూ.35 వేలకు తగ్గించింది. ఈ ఏడాది మళ్లీ ఫీజును రూ.47 వేలకు పెంచారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 140 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కనీస ఫీజు రూ.40 వేలుగా ఉంది. అది ఇప్పుడు రూ.47 వేలకు పెరగనుంది. మిగతా కాలేజీలకు పాత ఫీజులే అమలులో ఉంటాయని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. ఏపీ ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ (APFRMC) ఆయా ఇంజనీరింగ్‌ కాలేజీల ఆదాయ, వ్యయాలను గణించి రెండు, మూడు నెలల్లో కొత్త ఫీజులను ఖరారు చేయనుంది. ఈ ఫీజులే 2026-27 విద్యా సంవత్సరం నుంచి వచ్చే మూడేళ్ల పాటు అమల్లో ఉంటాయి. ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్ల పెంపుపై కూడా సర్కార్‌ పరిమితి విధించింది. గతేడాది సీట్ల సంఖ్యే ఈ ఏడాది కూడా ఉంటాయి.

AP EAPCET 2026 కౌన్సెలింగ్‌కి ముందు సిద్ధం చేసుకోవాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్లు ఇవే..

మరో వారంలో మొదలవనున్న ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్ కోసం అభ్యర్ధులు ముందుగానే కొన్ని ముఖ్యమైన సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవల్సి ఉంటుంది. చివరి నిమిషంలో పరుగులు తీయకుండా ముందుగానే ఈ కింది డాక్యుమెంట్లను రెండు సెట్లు జిరాక్స్ కాపీలు, ఒరిజినల్స్‌తో సహా రెడీ చేసుకోవడం మంచిది..

ఇవి కూడా చదవండి
  • AP EAPCET 2026 హాల్ టికెట్
  • AP EAPCET 2026 ర్యాంక్ కార్డ్
  • పదో తరగతి మార్క్స్ మెమో
  • ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో
  • 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు
  • తాజా ఆదాయ ధృవీకరణ పత్రం (ఇన్‌కాం సర్టిఫికెట్‌)
  • Caste సర్టిఫికెట్‌
  • ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్
  • టీసీ, ఆధార్ కార్డ్

Follow Us