GAIL Recruitment 2022: నెలకు రూ.2 లక్షల జీతంతో గెయిల్ ఇండియాలో ఉద్యోగాలు.. ఈ అర్హతలుండాలి..
భారత ప్రభుత్వ పెట్రోలియం, న్యాచులర్ గ్యాస్ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని గెయిల్ ఇండియా లిమిటెడ్ (GAIL India Limited) దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లలో.. 77 మేనేజర్, ఇంజనీర్, ఆఫీసర్ (Manager Posts) పోస్టుల భర్తీకి దరఖాస్తులు..
GAIL (India) Limited Manager Recruitment 2022: భారత ప్రభుత్వ పెట్రోలియం, న్యాచులర్ గ్యాస్ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని గెయిల్ ఇండియా లిమిటెడ్ (GAIL India Limited) దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లలో.. 77 మేనేజర్, ఇంజనీర్, ఆఫీసర్ (Manager Posts) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా, బీఈ, బీటెక్, బీఏ, బీఎస్సీ, బీకాం, సీఏ, సీఎంఏ, ఎంకాం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఎస్సీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 37 యేళ్లకు మించకుండా ఉండాలి. వయోపరిమితి విషయంలో రిజర్వేషన్ వర్తిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 15, 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.200లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.29,000ల నుంచి రూ.2,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఖాళీల వివరాలు..
- మేనేజర్(ఎఫ్ & ఎస్) పోస్టులు: 1
- మేనేజర్ (మార్కెటింగ్- సీఆర్‌ఎం) పోస్టులు: 2
- మేనేజర్ (మార్కెటింగ్ ఇంటర్నేషనల్, షిప్పింగ్) పోస్టులు: 3
- సీనియర్ ఇంజినీర్ (మెకానికల్) పోస్టులు: 6
- సీనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు: 3
- సీనియర్ ఇంజినీర్ (కెమికల్) పోస్టులు: 2
- సీనియర్ ఇంజినీర్ (గెయిల్‌టెల్ టీసీ/ టీఎం) పోస్టులు: 5
- సీనియర్ ఇంజినీర్ (బాయిలర్ ఆపరేషన్స్) పోస్టులు: 3
- సీనియర్ ఆఫీసర్ (ఎఫ్ & ఎస్) పోస్టులు: 5
- సీనియర్ ఇంజినీర్ (సివిల్) పోస్టులు: 2
- సీనియర్ ఆఫీసర్ (సి&పి) పోస్టులు: 4
- సీనియర్ ఆఫీసర్ (బీఐఎస్) పోస్టులు: 5
- సీనియర్ ఆఫీసర్ (మార్కెటింగ్) పోస్టులు: 7
- సీనియర్ ఆఫీసర్ (హెచ్‌ఆర్) పోస్టులు: 8
- సీనియర్ ఆఫీసర్ (ఎఫ్ & ఎ) పోస్టులు: 3
- సీనియర్ ఆఫీసర్ (సీసీ) పోస్టులు: 2
- ఆఫీసర్ (ల్యాబొరేటరీ) పోస్టులు: 3
- ఆఫీసర్ (ఓఎల్) పోస్టులు: 2
- సీనియర్ ఇంజినీర్ (ఇన్‌స్ట్రుమెంటేషన్) పోస్టులు: 1
- ఆఫీసర్ (ఒఎల్) పోస్టులు: 1
- సీనియర్ సూపరింటెండెంట్ (హిందీ) పోస్టులు: 1
- సీనియర్ అకౌంటెంట్ పోస్టులు: 2
- సీనియర్ సూపరింటెండెంట్ (హెచ్‌ఆర్) పోస్టులు: 1
- సీనియర్ కెమిస్ట్ పోస్టులు: 1
- ఫోర్‌మ్యాన్ (ఎలక్ట్రికల్) పోస్టులు: 1
- ఫోర్‌మ్యాన్ (ఇన్‌స్ట్రుమెంటేషన్) పోస్టులు: 1
- ఫోర్‌మ్యాన్(మెకానికల్) పోస్టులు: 2
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.