EIL Jobs 2022: బీటెక్ చేసి ఖాళీగా ఉన్నారా? రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూతో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!
భారత ప్రభుత్వానికి చెందిన ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL) ఎగ్జక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...
EIL Executive Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL) ఎగ్జక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీలు: 6
పోస్టుల వివరాలు:
- డిప్యూటీ మేనేజర్లు: 2
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్: 1
- సీనియర్ మేనేజర్/జనరల్ మేనేజర్: 4
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/బీఎస్సీ (ఇంజనీరింగ్)లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం, టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 36 నుంచి 47 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 20, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: