AP Govt Jobs 2023: కృష్ణా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రాత పరీక్షలేకుండా ఉద్యోగాలు.. నెలకు రూ.1,10,000 జీతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కృష్టా జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో పీడియాట్రిషియన్, జనరల్ ఫిజిషియన్, ఎంవో డెంటల్, ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్ తదితర..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కృష్టా జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో పీడియాట్రిషియన్, జనరల్ ఫిజిషియన్, ఎంవో డెంటల్, ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్, డెంటల్ టెక్నీషియన్, డీఈఐసీ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోనే అభ్యర్ధులు తప్పనిసరిగా పోస్టును బట్టి ఎంబీబీఎస్, ఎండీ, బీడీఎస్, డిగ్రీ, డిప్లొమా, బీపీటీ, బీఎస్సీ నర్సింగ్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తుదారుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. బీసీ/ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ వర్గాలకు 5 ఏళ్ల సడలింపు, వికలాంగ అభ్యర్ధులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో మే 16, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులను కింది అడ్రస్‌కు పంపించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, రిజర్వేషన్, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి పోస్టును బట్టి నెలకు రూ.18,000ల నుంచి రూ.1,10,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.