CUET UG 2026: సెంట్రల్ వర్సిటీల్లో ప్రవేశాలకు CUET UG 2026 నోటిఫికేషన్.. అప్లికేషన్ లింక్ ఇదే
CUET UG 2026 Online Registration: దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో 2026-27 విద్యాసంవత్సరానికి రకరకాల యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ యూజీ 2026 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఎన్టీయే ప్రకటన వెలువరించింది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు..

దేశవ్యాప్తంగా ఉన్న 48 సెంట్రల్ యూనివర్సిటీల్లో 2026-27 విద్యాసంవత్సరానికి రకరకాల యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ యూజీ 2026 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఎన్టీయే ప్రకటన వెలువరించింది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా 5 సబ్జెక్టుల్ని మాత్రమే ఎంచుకొనేందుకు అవకాశం ఉంటుంది. తెలుగు, ఇంగ్లిష్ సహా మొత్తం 13 భాషల్లో 37 సబ్జెక్టుల్లో ఈ పరీక్ష జరగనుంది. దేశంలో 306 సిటీలు, విదేశాల్లోని 15 సిటీల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు.
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ యూజీ)-2026కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అభ్యర్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జనవరి 31న రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు మూడు సబ్జెక్టుల వరకు రూ.1000, అడిషనల్ సబ్జెక్టుకు రూ.400, ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు మూడు సబ్జెక్టులకు రూ.900, అడిషనల్ సబ్జెక్టుకు రూ.375 చొప్పున తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, థర్డ్ జెండర్ అభ్యర్ధులు మూడు సబ్జెక్టులకు రూ.800, అడిషనల్ సబ్జెక్టుకు రూ.350 చొప్పున చెల్లించాలి.
హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, మరాఠీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, అస్సామీ, ఉర్దూ, పంజాబీ, ఒడియా.. ఈ 13 భాషల్లో పరీక్షలు నిర్వహిస్తారు. సీయూఈటీ యూజీ 2026 ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా వర్సిటీలు, ఇతర కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు. ఇక రాత పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో మే 11 నుంచి 31 వరకు నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది.
ముఖ్య తేదీలు ఇవే..
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 30, 2026.
- దరఖాస్తు రుసుము చెల్లింపు చివరి తేదీ: జనవరి 31, 2026.
- దరఖాస్తు సవరణ తేదీలు: ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు
- ఆన్‌లైన్ రాత పరీక్ష తేదీలు: మే 11 నుంచి 31 వరకు
- ఫలితాల ప్రకటన తేదీ: తర్వాతలో ప్రకటన
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (యూజీ)-2026 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




