AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CUET PG admissions 2022: సీయూఈటీ పీజీ 2022 నోటిఫికేషన్‌ విడుదల.. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇదే ఏకైక మార్గం!

పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు కూడా ఈ ఏడాది నుంచి కామన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష (CUET 2022)ని ప్రవేశపెట్టాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నిర్ణయించినట్లు చైర్మన్ జగదీష్ కుమార్ గురువారం..

CUET PG admissions 2022: సీయూఈటీ పీజీ 2022 నోటిఫికేషన్‌ విడుదల.. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇదే ఏకైక మార్గం!
Cuet Pg 2022
Srilakshmi C
|

Updated on: May 19, 2022 | 6:05 PM

Share

CUET-PG 2022 exam to be held in July: పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు కూడా ఈ ఏడాది నుంచి కామన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష (CUET 2022)ని ప్రవేశపెట్టాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నిర్ణయించినట్లు చైర్మన్ జగదీష్ కుమార్ గురువారం (మే 19) తెలిపారు. పీజీ కోర్సులకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నేటి నుంచి జూన్‌ 18 వరకు కొనసాగుతుందని ఈ సందర్భంగా యూజీసీ చైర్మన్ వెల్లడించారు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ uet.samarth.ac.in.లో దరఖాస్తు చేసుకోవచ్చు. 2022-23 విద్యాసంవత్సరానికి గానూ నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష జులై చివరి వారంలో.. పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలోనే జరుగుతుంది. కాగా 45 సెంట్రల్ యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ఎన్టీఏ ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. క్వశ్చన్‌ పేపర్‌ హిందీ లేదా ఇంగ్లీష్ ల్యాంగ్వేజులలో మాత్రమే ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి సీయూఈటీ ప్రవేశ పరీక్ష ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని, విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని యూజీసీ తెల్పింది.

యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ 2022లో సాధించిన మార్కుల ఆధారంగా మాత్రమే అడ్మిషన్లు జరుగుతాయి. 12వ తరగతి లేదా ఇంటర్‌లో సాధించిన మార్కులతో ప్రమేయం ఉండదని యూజీసీ ఇప్పటికే స్పష్టం చేసింది. CUET-UG కోసం ఇప్పటివరకు 10.46 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సీయూఈటీ యూజీ రిజిస్ట్రేషన్లు మే 22 తో ముగుస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.