CUET 2022 exam date: సీయూఈటీ 2022కు దరఖాస్తు చేసుకుంటున్నారా? ఐతే ఈ విషయాలు తెలుసుకోండి..

కామన్  యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (CUET-UG) - 2022కు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 45 సెంట్రల్ యూనివర్సిటీల్లో 2022-23 విద్యా సంవత్సరానికిగానూ..

CUET 2022 exam date: సీయూఈటీ 2022కు దరఖాస్తు చేసుకుంటున్నారా? ఐతే ఈ విషయాలు తెలుసుకోండి..
Cuet 2022
Follow us

|

Updated on: Apr 14, 2022 | 9:14 PM

CUET 2022 exam pattern: కామన్  యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (CUET-UG) – 2022కు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 45 సెంట్రల్ యూనివర్సిటీల్లో 2022-23 విద్యా సంవత్సరానికిగానూ యూజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. ప్రైవేట్, డీమ్డ్‌ టుబీ యూనివర్సిటీలు సైతం అడ్మిషన్ల కోసం సీయూఈటీ స్కోరును ఆధారంగా చేసుకోవచ్చని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) తెలిపింది. పరీక్ష నిర్వహణ బాధ్యతను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీకి అప్పగించింది. ఈ పరీక్ష ద్వారా జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్, ఇగ్నో, అలీగర్‌ ముస్లిం యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ వంటి మరెన్నో ప్రముఖ విద్యాసంస్థల్లో సీటు సంపాదించొచ్చు. ఈ పరీక్షకు ఇంటర్‌ మార్కుల వెయిటేజ్‌ ఉండదు. అధిక కటాఫ్‌ల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒక్కో యూనివర్సిటికి ఒక్కో ప్రవేశపరీక్ష రాయాల్సినవసరంలేకుండా అన్నింటికీ కలిపి ఒకేసారి రాసే విధంగా ఈ ఏడాది నుంచి కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ పరీక్షకు సంబంధించిన ముఖ్య సమాచారం మీకోసం..

అర్హతలు:

  • యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్‌/తత్సమాన అర్హత, 50 శాతం మార్కులతో పాసై ఉండాలి.
  • పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏదైనా డిగ్రీ/ సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

పరీక్ష విధానం: యూజీ పరీక్ష రెండు విడతలుగా ఆన్‌లైన్‌ మోడ్‌లో జరుగుతుంది. మొదటి స్లాట్‌లో 195 నిమిషాలు (3:15 గంటలు), రెండో స్లాట్‌లో 225 నిమిషాలు (3:45 గంటలు). మల్టిఫుల్‌ చాయిస్‌ ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు 5 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. కొన్ని సెక్షన్లలో 50 ప్రశ్నలకు గానూ 40 ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సరిపోతుంది. ఎంచుకున్న సబ్జెక్టుల ప్రకారం పరీక్ష వ్యవధి మారుతుంది. సిలబస్‌ కూడా అధిక శాతం ప్లస్‌టూ ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోంచే ఉంటుంది.

13 భాషల్లో (హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, మరాఠీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, అస్సామీ, ఉర్దూ, పంజాబీ, ఒడియా) రాయొచ్చు.

పరీక్షను మూడు భాగాలుగా ఉంటుంది

  • సెక్షన్‌-1ఎ: 13 భాషల్లో… రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ (వాస్తవిక, సాహిత్య అంశాలు) ప్రశ్నలుంటాయి. సెక్షన్‌-1బి: 20 భాషల్లో (తెలుగు సహా అన్ని ప్రాంతీయ భాషలు)… లిటరరీ ఆప్టిట్యూడ్, వొకాబ్యులరీ సంబంధిత ప్రశ్నలడుగుతారు. 50 ప్రశ్నలకు 40 సమాధానాలు రాయాల్సి ఉంటుంది. 45 నిమిషాల సమయం ఇస్తారు.
  • సెక్షన్‌-2: 27 డొమైన్‌ సంబంధిత సబ్జెక్టుల్లో.. (కనీసం ఒకటి, గరిష్ఠంగా 6 సబ్జెక్టులు) ఏదైనా ఎంచుకోవచ్చు. ఎంసీక్యూ తరహాలో 50 ప్రశ్నలుంటాయి. 40 ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. సమయం 45 నిమిషాలు (ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్‌ వంటి అంతర్జాతీయ భాషలు కూడా ఉంటాయి).
  • సెక్షన్‌-3: జనరల్‌ టెస్ట్‌(జీటీ)… కరెంట్‌ అఫైర్స్, జనరల్‌ నాలెడ్జ్, క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌ (అరిథ్‌మెటిక్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్‌ లాంటి ప్రాథమిక గణితాంశాలు), జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, న్యూమరికల్‌ ఎబిలిటీ, లాజికల్‌ అండ్‌ ఎనలైటికల్‌ రీజనింగ్‌ నుంచి ప్రశ్నలుంటాయి. 75 ప్రశ్నల్లో, 60 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. 60 నిమిషాల సమయం ఇస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌ అభ్యర్ధులకు: రూ.650
  • ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్ధులకు: రూ.600
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/థర్డ్‌ జెండర్‌ అభ్యర్ధులకు: రూ.550
  • విదేశాల్లో పరీక్ష రాసే అభ్యర్ధులకు: రూ.3000

దరఖాస్తులకు చివరితేదీ: మే 6, 2022.

పరీక్ష తేదీ: జులై మొదటి లేదా రెండో వారంలో ఉండొచ్చు.

పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

Also Read:

Krithi Shetty: అందాల భామ కృతి శెట్టి ఇన్‌స్టా ఫాలోవర్స్‌ ఎందరో తెలుసా..? అస్సలూహించరు..