CUCET Admit Card 2021: సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిట్ కార్డ్ విడుదల.. ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో తెలుసుకోండి..

CUCET Admit Card 2021: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CUCET) 2021 అడ్మిట్ కార్డును విడుదల చేసింది. ఈ పరీక్ష

CUCET Admit Card 2021: సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిట్ కార్డ్ విడుదల.. ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో తెలుసుకోండి..
Cu Cet Admiit Card 2021
Follow us
uppula Raju

|

Updated on: Sep 15, 2021 | 9:02 PM

CUCET Admit Card 2021: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CUCET) 2021 అడ్మిట్ కార్డును విడుదల చేసింది. ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్- cucet.nta.nic.in ని సందర్శించడం ద్వారా అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష సెప్టెంబర్ నెలలో నిర్వహిస్తారు. సెంట్రల్ యూనివర్సిటీల-కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం దరఖాస్తు ప్రక్రియ 16 ఆగస్టు 2021న ప్రారంభమైంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 5, 2021 వరకు సమయం ఇచ్చారు. ఫీజు సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 6, 2021. అయితే ఈ ఎగ్జామ్‌లో వచ్చిన ర్యాంక్‌ ఆధారంగా దేశంలోని పలు సెంట్రల్ యూనివర్సిటీలలోని యుజి, పిజి కోర్సులలో అడ్మిషన్లు కల్పిస్తారు.

అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేయడం ఎలా.. 1. అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్ cucet.nta.nic.in ని సందర్శించాలి 2. వెబ్‌సైట్ హోమ్ పేజీలో సెంట్రల్ యూనివర్సిటీలు – కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లింక్‌పై క్లిక్ చేయాలి. 3. ఇప్పుడు నమోదు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే సైన్ ఇన్ లింక్‌పై క్లిక్ చేయాలి. 4. దీనిలో అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ ద్వారా లేదా అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ ద్వారా లింక్‌కి వెళ్లండి. 5. ఇప్పుడు అభ్యర్థించిన వివరాలను పూరించడం ద్వారా లాగిన్ అవ్వండి. 6. లాగిన్ అయిన వెంటనే అడ్మిట్ కార్డు కనిపిస్తుంది. 7. దీన్ని డౌన్‌లోడ్ చేయండి ప్రింట్ అవుట్ తీసుకోండి.

ఈ యూనివర్సిటీలలో అడ్మిషన్లు జరుగుతాయి.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జారీ చేసిన CU CET 2021 (NTA CUCET 2021) నోటీసు ప్రకారం 12 యూనివర్సిటీలలో ఈ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. వీటిలో అస్సాం యూనివర్సిటీ సిల్చార్, సెంట్రల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ యూనివర్సిటీ గుజరాత్, సెంట్రల్ యూనివర్సిటీ హర్యానా, సెంట్రల్ యూనివర్సిటీ జమ్మూ, సెంట్రల్ యూనివర్సిటీ జార్ఖండ్, సెంట్రల్ యూనివర్సిటీ కర్ణాటక, సెంట్రల్ యూనివర్శిటీ కేరళ, సెంట్రల్ యూనివర్శిటీ పంజాబ్, సెంట్రల్ యూనివర్సిటీ రాజస్థాన్, సెంట్రల్ యూనివర్సిటీ సౌత్ బీహార్, సెంట్రల్ యూనివర్సిటీ తమిళనాడులు ఉన్నాయి.

IPL 2021: ఐపీఎల్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాళ్లు వీరే..! డేంజర్ బ్యాట్స్‌మెన్స్

Gas Cylinder Prices: సామాన్యులకు భారీ షాక్‌..!! మరింత పెరగనున్న గ్యాస్‌.. వీడియో

CM Jagan: బాబు వల్లే A గ్రేడ్‌లో ఉన్న ఏపీలోని మహిళా సంఘాలన్నీ C గ్రేడ్‌లోకి పడిపోయాయి: సీఎం వైయస్ జగన్