CSIR – CLRI Jobs 2022: సీఎస్‌ఐఆర్‌ – సెంట్రల్‌ లెదర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ తేదీలివే..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన చెన్నైలోని సీఎస్‌ఐఆర్‌ - సెంట్రల్‌ లెదర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (CSIR - CLRI).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, సీనియర్ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల (Project Associate Posts) భర్తీకి అర్హులైన..

CSIR - CLRI Jobs 2022: సీఎస్‌ఐఆర్‌ - సెంట్రల్‌ లెదర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ తేదీలివే..
Csir Clri
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 04, 2022 | 4:15 PM

CSIR – CLRI Project Associate Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన చెన్నైలోని సీఎస్‌ఐఆర్‌ – సెంట్రల్‌ లెదర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (CSIR – CLRI).. తాత్కాలిక ప్రాతిపదికన 10 ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, సీనియర్ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల (Project Associate Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి లెదర్‌ టెక్నాలజీ/కెమికల్‌ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్‌, కెమిస్ట్రీ/ఆర్గానిక్‌ కెమిస్ట్రీ/ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ/ఫిజికల్ కెమిస్ట్రీ/అనలిటికల్‌ కెమిస్ట్రీ/లైఫ్‌ సైన్సెస్‌/కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ తత్సమాన స్పెషలైజేషన్‌లో బీఎస్సీ లేదా బీసీఏ, డిప్లొమా, ఇంజనీరింగ్‌లో డాక్టరల్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం కూడా ఉండాలి. వయసు 35 నుంచి 50 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు సెప్టెంబర్‌ 13, 14 తేదీల్లో కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఇంటర్వ్యూ అర్హత సాధించిన వారికి నెలకు రూ.20,000ల నుంచి రూ.25,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అడ్రస్‌: CSIR-Central Leather Research Institute, Sardar Patel Road, Adyar, Chennai-600020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.