CBI Jobs: 535 ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకున్నారా? ఈ రోజే ఆఖరు..
ముంబాయి ప్రధాన కార్యాలయంగా ఉన్న పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India).. కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రాంతీయ కార్యాలయం, జోనల్ ఆఫీస్, సెంట్రల్ ఆఫీస్ స్థాయిలో..
Central Bank of India Recruitment 2022: ముంబాయి ప్రధాన కార్యాలయంగా ఉన్న పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India).. కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రాంతీయ కార్యాలయం, జోనల్ ఆఫీస్, సెంట్రల్ ఆఫీస్ స్థాయిలో పని చేయడానికి రిటైర్డ్ అధికారుల (retired officers) నుంచి దరఖాస్తులను కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 535
పోస్టుల వివరాలు: రీజనల్ ఆఫీస్: 360 జోనల్ ఆఫీస్: 108 సెంట్రల్ ఆఫీస్: 67
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 60 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ. 40, 000ల నుంచి రూ.1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు:
- ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఇన్‌స్ట్రుమెంటేషన్) పోస్టులకు.. కనీసం 60 శాతం మార్కులతో ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రికల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (మెకానికల్)పోస్టులకు.. కనీసం 65% మార్కులతో మెకానికల్/ ప్రొడక్షన్/ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్/ మ్యానుఫ్యాక్చరింగ్/ మెకానికల్ అండ్ ఆటోమొబైల్‌లో ఇంజనీరింగ్/టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఎలక్ట్రికల్)పోస్టులకు.. కనీసం 65% మార్కులతో ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక విధానం: గేట్ 2022 స్కోర్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని సంబంధిత జోన్‌లకు పోస్టు ద్వారా అప్లికేషన్ ను పంపిచాలి.
దరఖాస్తు రుసుము: రూ. 590
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2022 (సాయంత్రం 5:00 గంటల వరకు).
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: