Changes in CCE Marks: స్కూల్‌ విద్యార్ధులకు అలర్ట్.. సీసీఈ మార్కుల విధానంలో విద్యాశాఖ కీలక మార్పులు.. కొత్త విధానం ఇదే

రాష్ట్రంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులు మూల్యాంకన విధానంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. సీసీఈ మార్కుల్లో విద్యాశాఖ మార్పులు చేసి.. కొత్త విధానాన్ని ప్రకటించింది. ఆ వివరాలు ఈ కింద తెలుసుకోవచ్చు..

Changes in CCE Marks: స్కూల్‌ విద్యార్ధులకు అలర్ట్.. సీసీఈ మార్కుల విధానంలో విద్యాశాఖ కీలక మార్పులు.. కొత్త విధానం ఇదే
Changes in CCE Marks
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 02, 2024 | 8:39 AM

అమరావతి, డిసెంబర్‌ 2: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో నూతన నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)లో మార్కుల విధానాన్ని పాఠశాల విద్యాశాఖ తీసుకువచ్చింది. ఈ క్రమంలో గతంలో ఉన్న విధానంలో కొన్ని మార్పులు తీసుకువచ్చింది. గతంలో రాత పరీక్షకు 20 మార్కులు ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని 35 మార్కులకు మార్చింది. ఫార్మెటివ్‌ పరీక్షలు మొత్తం 50 మార్కులకు నిర్వహిస్తుండేవారు. ఇందులో 10 మార్కులు విద్యార్థి తరగతిలో స్పందించే విధానానికి, మరో 10 నోటు బుక్స్‌ రాయడం, హోంవర్క్‌కు, ఇంకో 10 ప్రాజెక్టు వర్క్స్‌కు, 20 మార్కులు రాత పరీక్షకు కేటాయించేవారు. అయితే తాజాగా 10 మార్కులను 5 చొప్పున తగ్గించారు. 20 మార్కుల రాత పరీక్షను 35గా మార్పు చేశారు. అంటే విద్యార్థి తరగతిలో స్పందించే విధానానికి 5 మార్కులు, నోటు బుక్స్‌ రాయడం, హోంవర్క్‌కు 5 మార్కులు, ప్రాజెక్ట్ వర్క్‌కు 5 మార్కులు. రాత పరీక్షకు 35 మార్కులు చొప్పున కేటాయిస్తారన్నమాట. ఈ విధంగా మార్కుల శాతాన్ని లెక్కించాలని రాష్ట్రంలోని అన్ని ప్రైమరీ, ఉన్నత పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఢిల్లీ బీబీనగర్‌ ఎయిమ్స్‌లో 37 శాతం బోధన సిబ్బంది పోస్టులు ఖాళీ?

దేశ రాజధాని బీబీనగర్‌ ఎయిమ్స్‌లో 69 బోధన పోస్టులు (37.70%), 498 బోధనేతర పోస్టులు (36.24%) ఖాళీగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావ్‌ జాదవ్‌ వెల్లడించారు. తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ వద్ద నమోదైన అల్లోపతిక్‌ డాక్టర్ల సంఖ్య 26,411 మేర ఉన్నట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈ మేరకు పార్లమెంట్‌ సెషన్‌లో వెల్లడించారు.

తెలంగాణ మైనార్టీల ‘సీఎం విదేశీవిద్య’ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తులు ప్రారంభం.. చివరి తేదీ ఇదే

తెలంగాణ రాష్ట్రంలోని మైనార్టీ విద్యార్థులు ‘సీఎం విదేశీవిద్య పథకం’ కింద విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఫాల్‌సీజన్‌ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. డిసెంబరు 1 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. డిసెంబర్‌ 31 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్‌ యాస్మీన్‌బాషా ఓ ప్రటకనలో తెలిపారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్‌ దేశాల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సులు అభ్యసించేవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు రూ.20 లక్షల స్కాలర్‌షిప్‌తో పాటు, ఒకవైపు ప్రయాణ టికెట్‌ అందిచనున్నారు. అర్హులైన విద్యార్థులు ‘ఈ-పాస్‌’ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్‌ యాస్మీన్‌బాషా కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.