CBSE Term 2 date sheet 2022: సీబీఎస్సీ 10, 12 తరగతుల టర్మ్-2 పరీక్షల తేదీలు విడుదల.. ఈ తేదీల్లోనే పరీక్షలు..
సీబీఎస్సీ 2022 టర్మ్ 2 పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను బోర్డు విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం..
CBSE 10th, 12th Practical Exam dates 2022: సీబీఎస్సీ 2022 టర్మ్ 2 పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను బోర్డు విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం 10, 12వ తరగతులకు సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మార్చి 2 నుంచి ప్రారంభంకానున్నాయి. థియరీ పరీక్షలకు 10 రోజుల ముందుగా ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు తెల్పింది. ఇక టర్మ్-2 బోర్డు పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి జరగనున్నట్లు సీబీఎస్సీ (CBSE) గురువారం (ఫిబ్రవరి 24) ప్రకటించింది. కాగా 2022 విద్యా సంవత్సరానికి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10, 12 తరగతుల పరీక్షలను కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించాలని ఈ సందర్భంగా తెలియజేసింది. త్వరలోనే టర్మ్ 2 పరీక్షలకు సంబంధించిన డేట్‌షీట్ (CBSE term 2 date sheet) కూడా విడుదలౌతుందని తెల్పింది. ఈ పరీక్షల్లో విద్యార్థులు ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ తరహా ప్రశ్నలకు సమాధానాలు రాయవల్సి ఉంటుంది. ఈ పరీక్షలకు సంబంధించిన నమూనా ప్రశ్న పత్రాలను(sample question papers) బోర్డు ఇప్పటికే విడుదల చేసింది. విద్యార్ధులు సీబీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో cbse.gov.in శాంపిల్ క్వశ్చన్ పేపర్లను చూడొచ్చు.
కాగా సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించడానికి విద్యార్థులను బ్యాచ్‌లుగా విడగొట్టి, ఒక్కోబ్యాచ్‌కు 10 మంది విద్యార్థుల ప్రకారంగా ల్యాబ్‌లలో పరీక్షలను నిర్వహించాలని సూచించింది.10వ తరగతి రెగ్యులర్ విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్షలు, 12వ తరగతి రెగ్యులర్ విద్యార్ధులకు ప్రాక్టికల్ పరీక్షలు ఈ ప్రకారంగా జరగనున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను మార్చి 2 నుంచి రోజువారీ ప్రాతిపదికన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని బోర్డు తెల్పింది. ప్రాక్టికల్ మార్కుల అప్‌లోడ్ సంబంధిత చివరి తేదీలోపు పూర్తి చెయ్యాలి. ఎట్టిపరిస్థితిలోనూ చివరితేదీని బోర్డు పొడిగించదని అధికారిక నోటిఫికేషన్‌లో తెల్పింది.
ఇక 10, 12 తరగతులకు చెందిన ప్రైవేట్ అభ్యర్థులకు ప్రాక్టికల్ పరీక్షలు లేనట్లు పేర్కొంది. బోర్డు నిర్వహించే థియరీ పరీక్షల్లో సాధించిన మార్కులను ప్రో-రేటా ప్రాతిపదికన కేటాయించడం జరుగుతుంది. గత ఏడాది మాదిరి ప్రాక్టికల్ పరీక్షలు/ ప్రాజెక్ట్/ ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లకు సూచించిన మార్కులు, థియరీ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా ప్రో-రేటా ప్రకారంగానే ఈ ఏడాది కూడా మార్కులు కేటాయించనున్నట్లు నోటిఫికేసన్‌లో బోర్డు తెల్పింది.
Also Read: