ACE Engineering Academy: బ్యాంకింగ్ పోటీ పరీక్షలకు శిక్షణ.. ఏసిఈ ఇంజినీరింగ్ అకాడమీ మరో ముందడుగు..

దేశ వ్యాప్తంగా పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న ఏసిఈ ఇంజినీరింగ్ అకాడమీ మరో ముందడుగు వేసింది. వివిధ ఇంజినీరింగ్ కోర్సులకు శిక్షణ ఇస్తున్న అకాడమీ, బ్యాంకింగ్ లో ఉన్న వివిధ కోర్సులతో పాటు స్టాఫ్ సెలక్షన్ కమిషన్..

ACE Engineering Academy: బ్యాంకింగ్ పోటీ పరీక్షలకు శిక్షణ.. ఏసిఈ ఇంజినీరింగ్ అకాడమీ మరో ముందడుగు..
Ace Engineering Academy
Follow us
Shiva Prajapati

| Edited By: Sanjay Kasula

Updated on: Feb 25, 2022 | 5:26 PM

దేశ వ్యాప్తంగా పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న ఏసిఈ ఇంజినీరింగ్ అకాడమీ(ACE Engineering Academy) మరో ముందడుగు వేసింది. వివిధ ఇంజినీరింగ్ కోర్సులకు శిక్షణ ఇస్తున్న అకాడమీ, బ్యాంకింగ్ లో(Banking) ఉన్న వివిధ కోర్సులతో పాటు స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్. ఆర్. బి, గ్రూప్ 1, 2, 3, 4 కోర్సులకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు అకాడమీ డైరెక్టర్ ఆచార్య వై. వి గోపాల కృష్ణమూర్తి హైదరాబాద్ అబిడ్స్ లోని తమ సంస్థ కార్యాలయం తెలిపారు. ఫిబ్రవరి 25న జరిగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ అసిస్టెంట్ పరీక్షలకు ఆన్ లైన్ తో పాటు మూడు నెలల తర్వాత ఆఫ్ లైన్ కూడా తర్ఫీదు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. గత 25 సంవత్సరాలుగా శిక్షణ ఇస్తున్న తమ అకాడమీ గేట్ పరీక్షల్లో 62 సార్లు దేశంలోనే తమ అకాడమీ నెంబర్ గా నిలిచిందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో అన్ని సంస్థలలాగా తాము దెబ్బతిన్నామని కోచింగ్ సరళి మారిన్నందునా ప్రత్యామ్నాయ మార్గాలతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు.

Also read:

Viral Video: రైనో, అడవి దున్న మధ్య భీకర యుద్ధం.. వీడియో చూస్తే గుండెలదిరిపోవాల్సిందే..

Health Tips: ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే, ఈ ఆహారాలను దూరం పెట్టండి..!

Kushboo Sundar: స్క్రిప్ట్ న‌చ్చితే కొత్త‌వారితో సినిమా చేయ‌డానికి నేను ఎప్పుడూ రెడీ : కుష్బూ