Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రైనో, అడవి దున్న మధ్య భీకర యుద్ధం.. వీడియో చూస్తే గుండెలదిరిపోవాల్సిందే..

Viral Video: అడవి జంతువుల జీవితం బహు విచిత్రమైనది. దినదిన గండం మాదిరిగా వాటి జీవితం అడవిలో కొనసాగుతుంది. ఏవైపు నుంచి ఏ జీవి వచ్చి అటాక్ చేస్తుందో..

Viral Video: రైనో, అడవి దున్న మధ్య భీకర యుద్ధం.. వీడియో చూస్తే గుండెలదిరిపోవాల్సిందే..
Wild Animals
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 25, 2022 | 6:16 AM

Viral Video: అడవి జంతువుల జీవితం బహు విచిత్రమైనది. దినదిన గండం మాదిరిగా వాటి జీవితం అడవిలో కొనసాగుతుంది. ఏవైపు నుంచి ఏ జీవి వచ్చి అటాక్ చేస్తుందో తెలియని పరిస్థితి ఉంటుంది. అడవి జంతువులకు సంబంధించి కొన్ని రమణీయ దృశ్యాలను మనం చూస్తేనే ఉంటాం. అదే సమయంలో క్రూరమైన వేట కూడా దర్శనమిస్తాయి. ఇక కొన్ని జంతువులు అయితే భీకరంగా పోట్లాడుతాయి. వైరిజాతుల జంతువులు.. ఒకదానితో మరొకటి కొట్లాడుతాయి. తాజాగా ఓ రైనో, అడవి దున్నకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రైనో, అడవి దున్నల మధ్య భీకర పోరాటం జరిగింది.

విశాలమైన మైదాన ప్రాంతంలో ఓవైపు రైనో, మరోవైపు అడవి దున్న మేత మేస్తున్నాయి. అలా అవి రెండూ సమీపించాయి. ఇంతలో ఏమైందో ఏమోగానీ.. రెండు కుమ్ముకోవడం స్టార్ట్ చేశాయి. అటు దున్న.. ఇటు రైనో.. తగ్గేదే లే అన్నట్లు పోట్లాడుకున్నాయి. అడవి దున్న సాధారణంగానే చాలా ఆగ్రహంతో ఉంటుంది. ఇక రైనో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దానికి కోపం వస్తే పరిస్థితి నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. రైనోకి కోపం నశాలానికి అంటినట్లుంది. దున్నపై విరుచుకుపడింది. కుమ్మి కుమ్మి వదిలేసింది. పైకి లేపి ఎత్తేసింది. రైనో బలం ముందు.. తన బలం సరిపోక ఆ దున్న పీచేముడ్ అంటూ వెనక్కి తిరిగి అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు దక్కించుకుంది. కాగా, రైనో, అడవి దున్న ఫైటింగ్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది.

Viral Video:

Also read:

UP Polls 2022: యూపీలో మరింత హీటెక్కిన పొలిటికల్ వార్.. బీజేపీపై సంచలన కామెంట్స్ చేసిన అఖిలేష్..

Gold Silver Price: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్.. మహిళలకు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Cm Kcr Delhi Tour: ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న సీఎం కేసీఆర్‌.. ఆయనను కలిసేందుకే వెళ్తున్నారా?..