UP Polls 2022: యూపీలో మరింత హీటెక్కిన పొలిటికల్ వార్.. బీజేపీపై సంచలన కామెంట్స్ చేసిన అఖిలేష్..
Uttar Pradesh Elections 2022: ఉత్తరప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలోనే ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

Uttar Pradesh Elections 2022: ఉత్తరప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలోనే ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా అధికార బీజేపీపై సెటైరికల్ పంచ్‌లు వేశారు ఎస్పీ చీఫ్ అఖిలేశ్. ప్రయాగ్‌రాజ్ ఎలక్షన్ ర్యాలీలో కీలక కామెంట్స్ చేశారాయన. కమలం పార్టీ పట్ల యువత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కొత్త ప్రభుత్వం తమకు సహాయం చేస్తుందనే ఆశతో వేలాది మంది నిరుద్యోగ యువకులు ఇక్కడికి వచ్చారని చెప్పారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఎస్పీ ర్యాలీకి యువత భారీగా తరలివచ్చారు. ఎస్పీ జెండాలు, బెలూన్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ‘కేవల్ సైకిల్ వాలే హాయ్ అజాద్ కరాయేంగే’ నినాదాలతో ప్రయాగ్‌రాజ్ వీధులు మార్మోగాయి. ఇక ఈ ర్యాలీలో బీజేపీ, యూపీలోని యోగీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు అఖిలేశ్‌యాదవ్. రైతులకు సరైన ధరతో పాటు ఎరువులు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారాయన.
రాష్ట్ర ప్రజలను అవమానించడమే కాకుండా అమాయకులపై ఫేక్ కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు ఎస్పీ చీఫ్. కమలం పార్టీ పట్ల యువత జాగ్రత్తగా ఉండాలని, మోసం చేసే హామీలను ప్రజలు నమ్మొద్దని సూచించారు. బీజేపీ ప్రభుత్వంలో ప్రజలకు వ్యతిరేకంగా అన్నీ పెరిగాయని, అందుకు ఉదాహరనే ప్రెట్రోల్ ధరల పెంపు అన్నారు. అటు నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో యువత ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు అఖిలేశ్. కేవలం సమాజ్‌వాదీ పార్టీతోనే యువతకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇక్కడి యువత జోష్ చూస్తుంటే, ఎస్పీ గెలుపు ఖాయమనే నమ్మకం కలుగుతోందని చెప్పారాయన. యువతలో ఉత్సాహం చూస్తుంటే, ఉత్తరప్రదేశ్‌కు స్వాతంత్ర్యం వచ్చిన ఫీల్ కలుగుతోందన్నారు. సమాజ్‌వాదీ పార్టీ ర్యాలీలో ఇంతమంది పాల్గొనడం, ఉత్సాహాన్ని చూస్తుంటే, మార్పు ఖాయమనే స్పష్టమవుతోందన్నారు. కచ్చితంగా సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తుందని, యువతకు న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు అఖిలేశ్ యాదవ్.
Also read:
Cm Kcr Delhi Tour: ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న సీఎం కేసీఆర్.. ఆయనను కలిసేందుకే వెళ్తున్నారా?..
Russia Ukraine Crisis: పుతిన్‌కు ఫోన్ చేసిన ప్రధాని మోడీ.. ఏం మాట్లాడారంటే..