Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అమ్మో పాము.. గుడ్లన్నీ గుటుక్కున మింగేసింది.. ఆ తరువాత ట్విస్ట్ చూస్తే షాక్..

Viral Video: మాంచి ఆకలి మీదున్న పాము.. ఆహారాన్ని వెతుక్కుంటూ గ్రామంలోకి ఎంటరైంది. ఇంతలో దానికి కోడిగుడ్లు కనిపించడంతో హమ్మయ్య అనుకుంది.

Viral Video: అమ్మో పాము.. గుడ్లన్నీ గుటుక్కున మింగేసింది.. ఆ తరువాత ట్విస్ట్ చూస్తే షాక్..
Snake
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 24, 2022 | 11:07 PM

Viral Video: మాంచి ఆకలి మీదున్న పాము.. ఆహారాన్ని వెతుక్కుంటూ గ్రామంలోకి ఎంటరైంది. ఇంతలో దానికి కోడిగుడ్లు కనిపించడంతో హమ్మయ్య అనుకుంది. ఇంకా ఆలస్యమెందుకంటూ అందిన ప్రతి గుడ్డునూ గుటుక్కున మింగేసింది. కానీ, ఆ తరువాత అసలు చుక్కలు కనిపించాయి పాముకు. మింగిన గుడ్లు కడుపులోకి వెళ్లాక అసలు సమస్య మొదలైంది. వాటిని జీర్ణం చేసుకోలేక నానా అవస్థలు పడింది ఆ పాము. చేసేదేమీ లేక.. మింగిన గుడ్లన్నింటినీ మళ్లీ బయటకు కక్కేసింది. ఈ షాకింగ్ ఘటన ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని కోశాంబి గ్రామంలో నివసిస్తున్న పవన్ లోన్బుల్ నివాసంలోకి రాత్రి వేళ త్రాచుపాము ప్రవేశించింది. ఇంట్లో ఉన్న కోడి గుడ్లను మింగింది. ఆపై సతమతమవుతూ.. బుసలు కొడుతూ.. కోడి దగ్గరకు వెళ్లింది. ఈ క్రమంలో శబ్ధం విని బయటకు వచ్చిన కుటుంబం.. ఆ పామును చూసి భయంతో పరుగులు తీసింది. వెంటనే స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించారు. అతను వెంటనే ఘటనా స్థలానికి వచ్చి పామును పట్టుకున్నాడు. ఈ క్రమంలోనే మింగిన గుడ్లను కక్కడం ప్రారంభించింది. వామ్మో ఈ పాము అన్ని గుడ్లు ఎలా తిని.. కక్కిందంటూ ఒకింత ఆశ్చర్యం, భయం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. కాగా, దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.

Also read:

Bio Asia Summit 2022: బయో ఏసియా సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. కీలక ప్రసంగం చేసిన మంత్రి..

Russia Ukraine Crisis: యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్‌ తొలిసారి ప్రెస్‌ మీట్‌.. ఏం చెప్పారంటే..

IND vs SL: హిట్‌మ్యాన్ @ టీ20 ఫార్మాట్‌ నయా కింగ్.. మూడో స్థానంలో విరాట్.. ఆ రికార్డులు ఏంటంటే?