BHEL Recruitment: బీహెచ్‌ఈఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు.. అర్హులు ఎవరు.? ఎలా ఎంపిక చేస్తారు..
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బిహెచ్‌ఈఎల్) పలు అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా అప్రెంటిస్, టెక్నీషియన్ అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీ చేయనున్నారు...
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బిహెచ్‌ఈఎల్) పలు అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా అప్రెంటిస్, టెక్నీషియన్ అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 76 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు (61), టెక్నికల్/గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (15) ఖాళీలు ఉన్నాయి.
* ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు హై స్కూల్ /ఐటిఐ (సంబంధిత ట్రేడ్)/ఎన్‌సివిటి సర్టిఫికెట్ కలిగి ఉండాలి. టెక్నిషియన్/గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు హైస్కూల్/డిప్లొమా/డిగ్రీ ఇంజనీరింగ్ (సంబంధిత సబ్జెక్టు) పూర్తి చేసి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అక్టోబర్ 16న ప్రారంభమవుతుండగా అక్టోబ్ 31ని చివరి తేదీగా నిర్ణయించారు.
* రాత పరీక్షను నవంబర్ 12, 2022న నిర్వహించనున్నారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..