BECIL Recruitment: బీఈసీఐఎల్‌లో భారీగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్… ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
BECIL Recruitment: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. న్యూఢిల్లీలోని ఈ సంస్థ దేశ వ్యా్ప్తంగా ఉన్న పలు కేంద్రాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది..
BECIL Recruitment: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. న్యూఢిల్లీలోని ఈ సంస్థ దేశ వ్యా్ప్తంగా ఉన్న పలు కేంద్రాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 418 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో లోడర్/ అన్‌స్కిల్డ్, సూపర్‌వైజర్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్/ స్కిల్డ్, ఎంటీఎస్/ హ్యాండీమ్యాన్/ లోడర్/ అన్‌స్కిల్డ్, సూపర్‌వైజర్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్/ స్కిల్డ్, సూపర్‌వైజర్ కమ్ డీఈవో/ సెమీ-స్కిల్డ్, సీనియర్ సూపర్‌వైజర్, కార్గో అసిస్టెంట్, ఆఫీస్ అటెండెంట్, హౌస్-కీపింగ్, హౌస్ కీపింగ్ సూపర్‌వైజర్, ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్ పోస్టులున్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా 8వ తరగతి, 10వ తరగతి, 12వ తరగతి, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటరాక్షన్, డాక్యుమెంట్ వెరికేషన్ ప్రక్రియ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన వారు బీఈసీఐఎల్ ఇంఫాల్, త్రివేండ్రం, ఇండోర్, జైపుర్, మంగళూరు, అగర్తల, పోర్ట్‌బ్లెయిర్, వైజాగ్, మధురై, రాంచీ, వారణాసి, గోవా, కోయంబత్తూర్, సూరత్, తిరుచ్చి, బాగ్డోగ్రా, పట్నా, పుణె, భువనేశ్వర్ కేంద్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 19-08-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* ఆన్‌లైన్ వాక్-ఇన్ ఇంటరాక్షన్‌ను 22-08-2022 తేదీన నిర్వహిస్తారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..