AYUSH NEET UG 2021: ఆయుష్ నీట్ యూజీ 2021 రెండో రౌండ్ కౌన్సెలింగ్ ప్రారంభం.. ఫలితాలెప్పుడంటే..
ఆయుష్ అడ్మిషన్స్ సెంట్రల్ కౌన్సెలింగ్ కమిటీ (AACCC) రెండో రౌండ్ యూజీ కౌన్సెలింగ్ 2021 రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమయ్యాయి..
AYUSH NEET UG 2021 2nd Round Counselling dates: ఆయుష్ అడ్మిషన్స్ సెంట్రల్ కౌన్సెలింగ్ కమిటీ (AACCC) రెండో రౌండ్ యూజీ కౌన్సెలింగ్ 2021 రిజిస్ట్రేషన్లు నేటి నుంచి (ఫిబ్రవరి 25) నుంచి ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ – aaccc.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాగా 2వ రౌండ్ ఆయుష్ నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియ మార్చి 2 మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుంది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు ఛాయిస్‌లను ఎంపిక చేసుకుని లాక్ చేసుకోవచ్చు. ఇక ఆయుష్ నీట్ యూజీ కౌన్సెలింగ్ రౌండ్ 2కు సంబంధించి సీట్ అలాట్‌మెంట్ ఫలితాలు మార్చి 5న విడుదలౌతాయి. ఈ కౌన్సెలింగ్ ద్వారా బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BHMS), బ్యాచిలర్ ఆఫ్ యునాని మెడిసిన్ అండ్ సర్జరీ (BUMS), బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద, మెడిసిన్ అండ్ సర్జరీ (BAMS), బ్యాచిలర్ ఆఫ్ సిద్ధ మెడిసిన్ అండ్ సర్జరీ (BSMS) కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. కాగా ఆల్ ఇండియా కోటా కింద నీట్ యూజీ కౌన్సెలింగ్ మొత్తం నాలుగు రౌండ్లలో జరుగుతుంది. రౌండ్ 1, రౌండ్ 2, మాప్-అప్ రౌండ్, స్ట్రే వేకెన్సీ రౌండ్లుగా జరుగుతుంది. మొదటి మూడు రౌండ్ల వరకు అభ్యర్ధులకు రిజిస్ట్రేషన్, ఛాయిస్‌ల ఫిల్లింగ్ ఉంటుంది. చివరి రౌండ్‌లో ఈ అవకాశం ఉండదు. మాప్-అప్ రౌండ్ లో ఫిల్ చేసిన ఎంపికలనే ఫైనల్ స్ట్రే వేకెన్సీ రౌండ్‌లో కేటాయింపు కోసం పరిగణించబడతాయి. యూజీ కౌన్సెలింగ్‌కు సంబంధించి మరిన్ని అప్‌డేట్‌ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేసుకోవాలని ఈ సందర్భంగా కౌన్సెలింగ్ కమిటీ పేర్కొంది.
Also Read: