AP Group 2 New Syllabus: ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్ష విధానంలో మర్పులు.. ఇకపై ఎలా ఉండబోతుందంటే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఏపీపీఎస్సీ గ్రూపు-2 నోటిఫికేషన్‌ విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కీలక ప్రకటన వెలువరించింది. గ్రూప్ 2 పరీక్ష విధానంలో మార్పులు చేయబోతున్నట్లు..

AP Group 2 New Syllabus: ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్ష విధానంలో మర్పులు.. ఇకపై ఎలా ఉండబోతుందంటే..
APPSC Group 2 Syllabus
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 08, 2023 | 8:34 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఏపీపీఎస్సీ గ్రూపు-2 నోటిఫికేషన్‌ విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కీలక ప్రకటన వెలువరించింది. గ్రూప్ 2 పరీక్ష విధానంలో మార్పులు చేయబోతున్నట్లు, సిలబస్‌లోనూ మార్పులు, పరీక్ష పేపర్లలో మార్పులు చేస్తూ ప్రభుత్వం జ‌న‌వ‌రి 6న‌ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా మార్పుల ప్రకారం.. ఇకపై ప్రిలిమినరీ పరీక్ష150 మార్కులకు నిర్వహించనున్నారు. మెయిన్‌ పరీక్షను రెండు పేపర్లకు పెట్టనున్నారు. ఒక్కో పేపర్‌150 మార్కుల చొప్పున మెయిన్స్‌ను 300 మార్కులకు నిర్వహించనున్నారు. గతంలో స్క్రీనింగ్‌ టెస్టును 150, మెయిన్స్‌ పరీక్షను మూడు పేపర్లకు నిర్వహించేవారు. అంటే మొత్తం 450 మార్కులకు ఉండేవి.

ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 పరీక్ష విధానం, సిలబస్‌ ఇలా..

  • ప్రిలిమినరీ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. సిలబస్‌..జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీ
  • మెయిన్స్‌ పేపర్‌-1 పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. సిలబస్‌.. ఏపీ చరిత్ర, భారత రాజ్యాంగం
  • మెయిన్స్‌ పేపరు-2 పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. సిలబస్‌.. ఆంధ్రప్రదేశ్‌, భారత ఆర్థిక పరిస్థితి, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.