AP High court Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీ హైకోర్టులో ఉద్యోగులు, ఎలా అప్లై చేసుకోవాలంటే..
AP High court Recruitment: ఆంధ్రప్రదేశ్‌లోని హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. అమరవాతిలోని హైకోర్ట్ ఆఫ్ ఆంధప్రదేశ్ పలు పోస్టులను..
AP High court Recruitment: ఆంధ్రప్రదేశ్‌లోని హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. అమరవాతిలోని హైకోర్ట్ ఆఫ్ ఆంధప్రదేశ్ పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నెల 30తో దరఖాస్తుల స్వీకరణ ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 174 ఖాళీలను భర్తీ చేయనున్నారు. * వీటిలో అసిస్టెంట్ (71), ఎగ్జామినర్ (29), టైపిస్ట్ (35), కాపియిస్ట్ (39) ఖాళీలు ఉన్నాయి. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఆర్ట్స్ /సైన్స్ / లా / కామర్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ టైప్ రైటింగ్ (ఇంగ్లిష్)లో హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణత పొంది ఉండాలి. * అభ్యర్థుల వయసు 01-07-2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత ఆబ్జెక్టివ్ టైప్ టైస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. * ప్రశ్నాపత్రంలో జనరల్ నాలెడ్జ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. * ఎస్సీ/ ఎస్టీ / పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 400, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 500, ఇతరులు రూ. 800 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. * దరఖాస్తుల స్వీకరణకు 30-09-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
Indian Railways Jobs: ఇండియన్ రైల్వేలో ఉద్యోగాలు.. 3093 అప్రెంటిస్ జాబ్స్.. అర్హతలు.. ఇతర వివరాలు..!