AP High Court: ఏపీలో 560 అంగన్వాడీ సూపర్‌వైజర్‌ పోస్టులకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌.. త్వరలోనే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోఅంగన్వాడీ సూపర్‌వైజర్‌ గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గతంలో నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ హైకోర్టులో పిటిషన్..

AP High Court: ఏపీలో 560 అంగన్వాడీ సూపర్‌వైజర్‌ పోస్టులకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌.. త్వరలోనే..
AP High Court
Follow us

|

Updated on: Jan 05, 2023 | 8:59 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అంగన్వాడీ సూపర్‌వైజర్‌ గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గతంలో 560 పోస్టులకు ఏపీ ప్రభుత్వ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 50 మార్కులకుగానూ 45 మార్కులకు నిర్వహించిన రాత పరీక్షకు 21,000ల మంది హాజరయ్యారు. మిగిలిన 5 మార్కులకు స్పోకెన్‌ ఇంగ్లీష్ టెస్ట్‌ నిర్వహించారు. వీరిలో 1 : 2 నిష్పత్తిలో 1,194 మందిని స్పోకెన్‌ ఇంగ్లిష్‌ టెస్టుకు ఎంపికచేశారు. ఒక్కొక్కరికీ 3 నుంచి 5 నిముషాల నిడివితో స్పోకెన్‌ ఇంగ్లిష్ వీడియోలు రికార్డు చేసిన తర్వాత ఇంత మంది వీడియోలు చూడటం కష్టమని అధికారులు భావించారు.

మెరిట్‌ లిస్ట్‌లో ఉన్నవారిని మాత్రమే స్పోకెన్‌ ఇంగ్లీష్ విడియోలు అప్‌లోడ్‌ చేయాలని సూచించడంతో అభ్యర్ధుల్లో గందరగోళం నెలకొంది. దీంతో కొందరు అభ్యర్ధులు నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఫలితాల ప్రకటనను నిలిపివేస్తూ హైకోర్టు స్టే విధించింది. దీనిపై తాజాగా విచారణ జరిపిన కోర్టు స్టేను ఎత్తివేస్తూ నిబంధనల ప్రకారం పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది. దీంతో వీటికి సంబంధించిన ఫలితాలు త్వరలోనే విడుదలవ్వనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.